హెచ్-1బి వీసా రగడ మళ్ళీ మొదలైంది
- January 07, 2017
హెచ్-1బి వీసా రగడ మళ్ళీ మొదలైంది. ట్రంప్ గెలుపుతో అమెరికాలో రిపబ్లికన్ పార్టీ తన ఎజెండాను అమలుచేయడానికి సిద్దమైంది. 'ప్రొటెస్ట్ ఎండ్ గ్రో అమెరికన్ జాత్స యాక్ట్' వేటుతో బిల్లును మరోసారి ప్రవేశపెట్టారు. దీంతో భారతీయిత హెచ్-1బి వీసాల ఆశలు గల్లంతయ్యే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే డిస్నీలాండ్ వంటి కంపెనీలు అమెరికన్లను ఉద్యోగాల నుంచి తొలగించి వారి స్థానంలో విదేశీయిల్ని నియమిస్తున్నారనే కారణాలతో ఆ సంస్థలపై తీవ్రమైన దుమారం చెలరేగింది. ఎన్నికల సందర్భంగా ట్రంప్ హెచ్-1బి వీసాల మీద చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఇదిలా వుండగా అమెరికన్ కాంగ్రెస్లో బిల్లు ప్రవేశపెట్టడంతో భారతీయులు ఐటీ సంపెనీల మీద ప్రభావం పడింది.
ఇన్ఫోసిస్, టిసిఎస్, విప్రో వంటి కంపెనీల షేర్ల ధరలు పడ్డాయి. టెక్ మహీంద్ర, హెక్సావేర్ టెక్నాలజీస్, హెచ్సిఎల్ సంస్థల షేర్లు సైతం కిందకు చూస్తున్నాయి. దాదాపు 22 వేల కోట్లు మార్కెట్ వ్యాల్యువేషన్ కోల్పోతున్నట్లు అధికారిక లెక్కలు తెలియచేస్తున్నాయి. హెచ్-1బి వీసాలు పొందటానికి కావాల్సిన అర్హతల్ని మార్చడంతో భారతీయ ఐటి కంపెనీలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్నది కొంతకారణంగా వినిపిస్తున్నమాట. సాలీనా లక్ష జనల్లో కనీస వేతనం, మాస్టర్స్ డిగ్రీ కలిగివుండాలనే నిబంధనల్ని బిల్లులో చేర్చడం కూడా భారతీయులకు ప్రతిబంధకాలు కానున్నాయి.
తాజా వార్తలు
- ఖతార్ లో ఆకట్టుకున్న ఫుడ్ ఫెస్టివల్ 2026..!!
- సౌదీ స్పెషల్ టాలెంట్ ప్రీమియం రెసిడెన్సీ..3,484 సంస్థలకు ఆమోదం..!!
- ఒమన్ లో పెరిగి చలిగాలుల తీవ్రత..!!
- కువైట్ లో భద్రత బలోపేతం..BMW పెట్రోల్ వాహనాలు..!!
- గల్ఫ్ఫుడ్ 2026ను సందర్శించిన షేక్ మొహమ్మద్..!!
- బహ్రెయిన్ ఓపెన్ టెన్నిస్ ఛాలెంజర్ ప్రారంభం..!!
- చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వ శుభవార్త
- తెలంగాణ ప్రభుత్వం ఇన్ని ఉద్యోగాలు ఇచ్చింది: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
- తెలంగాణ: గణతంత్ర దినోత్సవం..తెలంగాణకు 23 పోలీస్ పతకాలు
- మంగళవారం బ్యాంక్ ఉద్యోగుల బంద్







