తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా ముక్కోటి ఏకాదశి...
- January 07, 2017
హైదరాబాద్ : ముక్కోటి ఏకాదశి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా ప్రారంభమయ్యాయి. వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఆదివారం తెల్లవారుజామునుంచే ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెలంగాణలోని యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు. అలాగే ధర్మపురి నృసింహస్వామి ఆలయం, పశ్చిమగోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. కాగా... చిన వెంకన్నను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్ దర్శించుకున్నారు. అలాగే నరసాపురం దగ్గర గోదావరిలో భక్తుల పుణ్యస్నానాలు ఆచరించారు. అలాగే ఏలూరు ఆర్ఆర్పేట వెంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తులు పెద్దఎత్తున పూజలు నిర్వహించారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







