14వ ప్రవాసీ భారతీయ దివాస్ ను ప్రారంభించటానికి బెంగుళూరు చేరుకున్న మోదీ

- January 07, 2017 , by Maagulf
14వ ప్రవాసీ భారతీయ దివాస్ ను ప్రారంభించటానికి బెంగుళూరు చేరుకున్న మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ నేడు కర్ణాటకలో పర్యటించనున్నారు. ప్రత్యేక విమానంలో శనివారం అర్ధరాత్రి మోదీ బెంగళూరుకు చేరుకున్నారు. ఉన్నతాధికారులతో సహా ఎయిర్‌పోర్టుకు వచ్చిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలికారు. నేడు బెంగళూరులో రెండోరోజు జరగనున్న ప్రవాసి భారతీయ దివాస్ కార్యక్రమాన్ని మోదీ ప్రారంభించనున్నారు. మూడు రోజులపాటు జరగనున్న ఈ ఈవెంట్ ఓవరాల్‌గా 14వ ప్రవాసీ భారతీయ దివాస్ కార్యక్రమం 'యూత్ ప్రవాసీ భారతీయ దివాస్'గా ఈవెంట్‌కు నామకరణం చేశారు. స్టార్ట్ అప్ అండ్ ఇన్నోవేషన్, స్టార్ట్ అప్ ఇన్ కర్ణాటకతో పలు కార్యక్రమాలను మోదీ ప్రారంభిస్తారు. నేడు జరగనున్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోర్చుగల్ ప్రధాని ఆంటోనియో కోస్టా విచ్చేయనున్నారు. భారతీయ మూలాలున్న ఆంటోనియో కోస్టా స్వతహాగా రచయిత. ఆంటోనియా తండ్రి ఓర్లాండో డీ కోస్టా.. గోవా ప్రాంతంలో జన్మించారు. నేటి ఈవెంట్లకు సంబంధించి కర్ణాటక అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు సమాచారం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com