అల్ వహ్దా మాల్‌లో పండుగ వాతావరణం ....
- January 09, 2017
'ఇయర్ ఆఫ్ గివింగ్' ఇనీషియేటివ్‌లో భాగంగా అల్ వహ్దా మాల్ నిర్వాహకులు తమ మాల్‌ని సందర్శించేవారికోసం ఆసక్తికరమైన అనేక కార్యక్రమాల్ని చేపడ్తోంది. అల్ నూర్ ట్రెయినింగ్ సెంటర్ ఫర్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్‌తో కలిసి ఈ కార్యక్రమాల్ని నిర్వహిస్తోంది. అబుదాబీలోని మాల్ ప్రాంగణంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అల్ వహ్దా మాల్ అధికార ప్రతినిథి మాట్లాడుతూ, మాల్ గోయర్స్ డిజైన్ చేసిన కార్డ్స్‌ని, అల్ నూర్ సెంటర్‌కి చెందిన చిన్నారులకు అందిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం తీసుకునే 'ఇయర్ ఆఫ్ గివింగ్' వంటి నిర్ణయాలకు సంబంధించి ప్రచారం కల్పించడం, పలు కార్యక్రమాలు చేపట్టడంలో తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని అల్ వహ్దా మాల్ జనరల్ మేనేజర్ నౌమాన్ ఠాకూర్ చెప్పారు. న్యూ ఇయర్ ఈవెంట్స్‌ని కూడా ఈ మాల్ అంగ రంగ వైభవంగా నిర్వహించింది. ఆ ఉత్సాహాన్ని ఇంకా అలాగే తమ మాల్‌లో కొనసాగిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







