'ఖైదీ నెంబర్‌ 150' విడుదల సందర్భంగా హాలీడే!....

- January 09, 2017 , by Maagulf
'ఖైదీ నెంబర్‌ 150' విడుదల సందర్భంగా హాలీడే!....

మెగాస్టార్‌ రీఎంట్రీ సినిమా 'ఖైదీ నెంబర్‌ 150' విడుదల సందర్భంగా హడావిడి మామూలుగా లేదు.కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు విదేశాల్లో కూడా ఈ సినిమా మంచి క్రేజ్‌ సంపాదించుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగాభిమానులందరూ ఈ సినిమా గురించి ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా 'ఖైదీ నెంబర్‌ 150' ఫీవర్‌ రియాద్‌కు కూడా పాకింది. అక్కడి తెలుగువారు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 'ఖైదీనెంబర్‌ 150' విడుదల సందర్భంగా ఒమాన్లోని అల్ రియాద్ కన్స్ట్రక్షన్ & ట్రేడింగ్ యల్.యల్.సి కంపెనీ మేనేజర్ రాందాస్ చందాకా తమ ఉద్యోగులకు జనవరి 11న సెలవు దినంగా ప్రకటించారు.ఈ విషయాన్ని ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేశాడు. గతంలో కబాలి సినిమాకు కూడా ఇలాగే పలు కంపెనీలు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com