మస్కట్ మెగా ఫ్యాన్స్: మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్...
- January 09, 2017
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన 'ఖైదీ నెంబర్ 150' సినిమా జనవరి 11న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో మస్కట్‌లోని చిరంజీవి అభిమానులు మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్‌ని నిర్వహించారు. సిఎంవైఎఫ్ మస్కట్ జనవరి 6న నిర్వహించిన ఈ క్యాంప్‌లో మొత్తం 105 మంది రక్తదానం చేశారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బౌచర్ బ్లడ్ సెంటర్ (రాయల్ హాస్పిటల్ ఎదురుగా)లో ఈ కార్యక్రమం జరిగింది. సిఎంవైఎఫ్ ఫౌండర్ ప్రెసిడెంట్ రామదాస్ చందక నాయకత్వంలో ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ తరఫున గత ఎనిమిదేళ్ళుగా బెస్ట్ బ్లడ్ డోనర్ టీమ్‌గా సిఎంవైఎఫ్ పురస్కారాల్ని అందుకుంటోంది.




తాజా వార్తలు
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్







