ప్రవాసి భారతీయ దివస్ లో వలస కార్మికుల సమస్యల ప్రస్తావన
- January 09, 2017
టియుసిసి జాతీయ అధ్యక్షులు, తెలంగాణ కు చెందిన వలస కార్మిక నాయకులు పి.నారాయణ స్వామి నాయకత్వంలో ఐదుగురు సభ్యుల బృందం బెంగళూరు లో జరుగుతున్న ప్రవాసి భారతీయ దివస్-2017 ఉత్సవాలకు హాజరయ్యారు. ఈ నెల 9 న సోమవారం కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రులు డా. వికె సింగ్, ఎంజె అక్బర్ లను కలిసి ఎన్నారైలు, ప్రవాసి కార్మికుల సంక్షేమానికి భారత ప్రభుత్వం తీసుకోవలసిన చర్యల గురించి విజ్ఞప్తి చేశారు. వీరితో పాటు దుబాయికి చెందిన గిరీష్ పంత్, షార్జాకు చెందిన జనగామ శ్రీనివాస్ ఉన్నారు.
యుఏఇ దేశంలోని అబుదాబి లోని భారత రాయబారి నవదీప్ సూరి ని కలిసి గల్ఫ్ కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రస్తావించారు. భారత్ - యుఏఇ దేశాల మధ్య కుదిరిన ఖైదీల బదిలీ ఒప్పందం అమలు, దుబాయి జైల్లో ఉన్న సిరిసిల్ల కు చెందిన ఐదుగురు ఖైదీల విడుదల, షార్జా జైల్లో ఉన్న మూటపల్లి కి చెందిన ధరూరి బుచ్చయ్య విడుదల గురించి విజ్ఞప్తి చేశారు. అబుదాబి అగ్ని ప్రమాదం లో మరణించిన తెలంగాణకు చెందిన ఐదుగురి మృత దేహాలను త్వరగా పంపాలని విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?
- 2025లో ఖతార్ లో 3% పెరిగిన ప్యాసింజర్స్..!!







