తీవ్రవాదుల మద్దతుదారునికి జైలుశిక్ష విధించిన రియాద్ కోర్టు
- January 09, 2017
జెడ్డా : సిరియా ఉగ్రవాదంలో పాల్గొనడానికి టర్కీ ప్రయాణిస్తూ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఒక సౌదీ వ్యక్తికి ఏడున్నర సంవత్సరాల జైలుశిక్షను రియాద్ ప్రత్యేక నేర న్యాయస్థానం విధించారు. తన తప్పును అంగీకరించిన నిందితుడు అల్ నుస్ర తీవ్రవాద సంస్థలో సభ్యునిగా చేరాడు. ఆ బృందానికి వదిలివచ్చే ముందు అక్కడ సభ్యుల నుండి శిక్షణ పొందాడు. తనకు శిక్షణ ఇచ్చిన వారు గూర్చి గాని,టెర్రరిస్ట్ సమూహానికి చెందిన ఇతర పేర్లను అధికారుల ముందు వెల్లడించడానికి నిరాకరించాడు. న్యాయస్థానం ఎదుట దోషిగా నిలబడిన ఈ సౌదీ పౌరుడు అల్ ఖ్అస్సిమ్ నిర్వహించిన కార్యక్రమాలలో పాల్గొన్నాడు భద్రతాదళం ఆధీనంలో ఉన్న కొంతమంది ఖైదీలను విడిపించిందేకు ఆర్థికంగా సహాయపడ్డాడు భద్రతా సందర్భాల్లో అదుపులోకి తీసుకొనబడిన మహిళలకు మద్దతు ఇచ్చేందుకు అలాగే వారి విడుదల చేయటానికి ద్రవ్యం సమకూర్చాడు. అంతేకాక ఈ నిందితుడు సిరియాలో హింసాత్మక చర్యలు, యుద్ధ మద్దతు తెలిపిన ఒక మహిళ నుండి 4,000 సౌదీ రియాళ్లను సైతం పొందాడు మరియు యెమెన్ లో పోరాడటానికి మహిళ ఎదుట కోరిక వ్యక్తం చేశాడు. ఆ సౌదీ వ్యక్తి దేశం యొక్క భద్రత బెదిరించే విధంగా సిరియా మహిళ ప్రయాణం చేసేందుకు సహాయం చేయాలని జనాలతో సామాజిక మీడియా ద్వారా సమస్యలను పోస్టు చేస్తూ సోషల్ మీడియా ఉపయోగించాడు. తదితర కారణాలతో రియాద్ ప్రత్యేక నేర న్యాయస్థానం ఏడున్నర సంవత్సరాల జైలుశిక్షను విధించింది. ఆ నిందితుడు విడుదలైన తరువాత సైతం దేశం విడిచి వెళ్లరాదని 10 సంవత్సరాల ప్రయాణ నిషేధం ఇవ్వబడింది, కానీ ఆ నిందుతుని తాను చేసిన చర్యలకు పశ్చాత్తాపం పడటం గమనించింది. దీనితో కోర్టు మూడు సంవత్సరాలు శిక్షను రద్దు చేయడానికి నిర్ణయించుకుంది.
తాజా వార్తలు
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?
- 2025లో ఖతార్ లో 3% పెరిగిన ప్యాసింజర్స్..!!
- ఐఫోన్ యూజర్లకు శుభవార్త: ఆపిల్ పే త్వరలో
- మేడారం లో హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి
- చంద్రుడిపై హోటల్.. రంగంలోకి స్టార్టప్ కంపెనీ..ఒక్కో అతిథికి ఖర్చు ₹2.2 కోట్ల నుంచి ₹90 కోట్లు!
- లిక్కర్ కేసు.. ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి







