కన్నడ జూనియర్ ఆర్టిస్టు అనుమానాస్పద మృతి
- January 10, 2017
కన్నడ జూనియర్ ఆర్టిస్టు పద్మావతి (44) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. యలహంక సమీపంలోని ఓ భవనంలో సోమవారం సాయంత్రం షూటింగ్ జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ధనుష్ తమిళ చిత్రం 'వీఐపీ'కి రీమేక్గా తెరకెక్కిస్తున్న చిత్రంలో పద్మావతి నటిస్తున్నారు. దాదాపు 120 మంది బృందంతో సోమవారం సాయంత్రం చిత్రం షూటింగ్ జరిగింది. 5.30 గంటలకు ప్యాక్అప్ సమయంలో పద్మావతి సెట్లో లేదని గుర్తించారు. వెంటనే ఆమెకోసం వెదకగా నిర్మాణంలో ఉన్న మరో భవనం వద్ద ఆమె మృతదేహం దొరికింది. ఆమె మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం యలహంక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పద్మావతి కనిపించలేదని రాత్రి 9 గంటలకు తమకు సమాచారం వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
దర్శకుడిని సంప్రదించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయిందని పేర్కొన్నారు. అయితే పద్మావతి మధ్యాహ్నం 3 గంటల నుంచి తనకు కనిపించలేదని ఆమె స్నేహితురాలు చెప్పారు. దీంతో పద్మావతి మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
తాజా వార్తలు
- ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్
- మస్కట్ చేరుకున్న ప్రధాని మోదీ
- సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై కేంద్ర ప్రభుత్వం కొరడా
- చరిత్రలో నిలిచేలా TTD నిర్ణయాలు..!
- ANR కాలేజీకి నాగార్జున రూ.2 కోట్ల విరాళం
- కోడూరు అవుట్ఫాల్ స్లూయిస్ల పునర్నిర్మాణం: ఎంపీ బాలశౌరి
- ఏపీ సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల
- కార్తీక్ శర్మ: ఐపీఎల్ 2026 వేలంలో 14.2 కోట్లు..
- రేపు నటుడు విజయ్ భారీ ర్యాలీ
- శీతాకాల విడిది కోసం హైదరాబాద్కు చేరుకున్న రాష్ట్రపతి







