పవన్ అభిమానులకు సంక్రాంతి కానుక!
- January 10, 2017
సంక్రాంతి విందుగా, సినీ ప్రేక్షకులకు కానుకగా చిరంజీవి 150వ సినిమా ఖైదీ నంబర్ 150, బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలు బరిలో నిలస్తున్నాయి. తద్వారా ప్రేక్షకులకు పండుగ ఫీస్ట్‌ను అందించబోతున్నాయి. ఇక, పవర్‌స్టార్ కూడా తన అభిమానులకు పండగ గిఫ్ట్‌ను ఇవ్వబోతున్నాడు. కొత్త సంవత్సరం కానుకగా కాటమరాయుడు కొత్త పోస్టర్లు విడుదలైన సంగతి తెలిసిందే. పోస్టర్లపై కొంత నెగెటివ్ ఎఫెక్ట్ పడినా.. ఆ నెగెటివ్ ఎఫెక్ట్ పోగొట్టడానికి వస్తున్నాడు కాటమరాయుడు. సంక్రాంతి కానుకగా సినిమా టీజర్‌లో కనువిందు చేయబోతున్నాడు. సంక్రాంతి పండగ రోజే అంటే 14వ తేదీనే కాటమరాయుడు టీజర్‌ను విడుదల చేయబోతున్నట్టు కాటమరాయుడు యూనిట్ ప్రకటించింది.
శనివారం సాయంత్రం 7 గంటలకు టీజర్‌ను విడుదల చేస్తామని వెల్లడించింది. ప్రస్తుతం గోల్కొండలో కాటమరాయుడు షూటింగ్ జరుగుతోంది. నెలాఖరులోపు సినిమాను పూర్తి చేసి ఉగాది కానుకగా మార్చిలో సినిమాను విడుదల చేయాలన్న కృత నిశ్చయంతో ఉంది కాటమరాయుడు టీమ్.
తాజా వార్తలు
- ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్
- మస్కట్ చేరుకున్న ప్రధాని మోదీ
- సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై కేంద్ర ప్రభుత్వం కొరడా
- చరిత్రలో నిలిచేలా TTD నిర్ణయాలు..!
- ANR కాలేజీకి నాగార్జున రూ.2 కోట్ల విరాళం
- కోడూరు అవుట్‌ఫాల్ స్లూయిస్ల పునర్నిర్మాణం: ఎంపీ బాలశౌరి
- ఏపీ సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల
- కార్తీక్ శర్మ: ఐపీఎల్ 2026 వేలంలో 14.2 కోట్లు..
- రేపు నటుడు విజయ్ భారీ ర్యాలీ
- శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి







