థాయ్‌ వెజిటబుల్‌ రెడ్‌ కర్రీ..

- January 10, 2017 , by Maagulf
థాయ్‌ వెజిటబుల్‌ రెడ్‌ కర్రీ..

కావలసిన పదార్థాలు : క్యారెట్‌ - 25గ్రా, బీన్స్‌ - 25గ్రా, క్యాలీఫ్లవర్‌ -25గ్రా, కొబ్బరిపాల పొడి - 50గ్రా, బ్రొక్కోలి - 20గ్రా, బేబీకార్న్‌- 10గ్రా, కార్న్‌ఫ్లోర్‌- 50గ్రా, రెడ్‌ కర్రీ పేస్ట్‌ - 20గ్రా, తులసి ఆకులు -కొన్ని, నిమ్మ ఆకులు- కొన్ని, వెదుర్లు - 10గ్రా, ఫిష్‌ సాస్‌ - 5 మి.లీ, నువ్వుల నూనె - ఒక స్పూన్‌, ఉప్పు - తగినంత, నూనె - రెండు స్పూన్‌లు, వంకాయలు(పచ్చవి) - 20గ్రా, అల్లం - 5గ్రా.
తయారుచేయు విధానం : ముందుగా వేడి నీటిని తీసుకుని అందులో కొబ్బరి పాల పొడిని వేసి కొబ్బరిపాలు తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో నూనె వేసి కాస్త వేడి అయ్యాక సిద్ధంగా పెట్టుకున్న అన్నిరకాల కూరగాయలను వేసుకోవాలి. అందులోనే రెడ్‌కర్రీ పేస్ట్‌, అల్లం, వంకాయలు, నిమ్మ ఆకులు, కార్న్‌ఫ్లోర్‌, వెదుర్లు, ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. తరువాత కొబ్బరి పాలు పోసుకోవాలి. నువ్వుల నూనె, ఫిష్‌ సాస్‌ వేసి మరికొద్ది సేపు ఫ్రై చేశాక చివరగా తులసి ఆకులతో గార్నిష్‌ చేసుకోవాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com