ఖతార్ ఎయిర్ వేస్ 'ట్రావెల్ ఫెస్టివల్ ఆపర్స్..
- January 10, 2017
ఖతార్ ఎయిర్‌వేస్, ట్రావెల్ ఫెస్టివల్‌ని మరోసారి ప్రయాణీకులకోసం తీసుకొచ్చింది. ఎయిర్‌లైన్‌కి చెందిన గ్లోబల్ నెట్‌వర్క్‌లో పలు ఆఫర్లను ప్రయాణీకులకు అందించనున్నారు. జనవరి 16 వరకు ఈ ఆఫర్లతో కూడిన టిక్కెట్ల సేల్స్ అందుబాటులో ఉంటాయి. బిజినెస్, ఎకానమీ క్లాసుల్లో ప్రయాణానికి ఈ ఆఫర్లు వర్తిస్తాయి. అలాగే డబుల్ క్యూ మైల్స్, బుక్ మోర్ సేవ్ మోర్ అనే ఆప్షన్స్‌తో కూడా ఆఫర్లను రూపొందించారు. ట్రెజర్ హంట్, గోల్డెన్ టిక్కెట్ వంటి ఆఫర్లు ప్రయాణీకుల్ని విశేషంగా ఆకట్టుకోనున్నాయి. ట్రావెల్ ఏజెంట్లు, ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా కూడా ఈ ఆఫర్లను పొందే వీలుంది. ఈ ఆఫర్లపై జనవరి 11 నుంచి డిసెంబర్ 15 వరకు ప్రయాణించొచ్చు. 150కి పైగా డెస్టినేషన్స్‌కి ఖతార్ ఎయిర్‌వేస్ విమానాల్ని నడుపుతోంది. ఖతార్ ఎయిర్‌వేస్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ డాక్టర్ హుష్ డున్‌లీవీ మాట్లాడుతూ, 40 శాతం వరకు డిస్కౌంట్లు, అలాగే కిడ్స్ ఫ్లై ఆఫర్, ఇంకా చాలా చాలా ఆఫర్లు ప్రయాణీకులకు ఆనందకరమైన ప్రయాణాన్ని అందివ్వనున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- టీ20 సిరీస్ టీమిండియాదే
- మేరీల్యాండ్‌లో మెరిసిన తెలుగు ఆణిముత్యాలు
- ముసాందంలో వరదల్లో డ్రైవింగ్.. డ్రైవర్ అరెస్ట్..!!
- అత్యున్నత పురస్కారాల్లో ప్రధాని మోదీ రికార్డు..!!
- ఏనుగు సజీవ దహనం..ముగ్గురు అరెస్ట్..!!
- 72 మిలియన్ గ్యాలన్ల రెయిన్ వాటర్ తొలగింపు..!!
- మెచ్యూరిటీ ఇండెక్స్ 2025లో సౌదీకి రెండో స్థానం..!!
- యూఏఈలో రెయిన్స్ తగ్గుముఖం..!!
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'







