ఖైదీ నంబర్ 150 ఫై బాలయ్య స్పందన..
- January 10, 2017
నందమూరి బాలకృష్ణ వందో చిత్రంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన మూవీ గౌతమిపుత్ర శాతకర్ణి..ఈ చిత్రం విడుదల కు ఇంకా పట్టుమని 24 గంటలు మాత్రమే ఉంది..మరోపక్క అమరావతి లో ఈ చిత్ర ప్రత్యేక షోస్ వేయడం జరుగుతుంది..ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు శాతకర్ణి బాలకృష్ణ కెరియర్ లోనే మైలురాయి గా నిలిచిపోబోతుందని అంటున్నారు..
ఇక నిన్నంతా ప్రమోషన్స్ లలో బిజీ అయినా బాలయ్య సినిమా లోని హైలైట్స్ ను మీడియాతో పంచుకున్నారు..అలాగే శాతకర్ణి తో పాటు రిలీజ్ అవుతున్న చిరంజీవి 150 వ చిత్రమ్ ఖైదీ ఫై కూడా ఆయన స్పందించాడు..'నాకు గౌతమిపుత్ర శాతకర్ణి ఎంత ముఖ్యమో.. చిరంజీవికి ఖైదీ నంబర్ 150 కూడా అంతే. రెండు సినిమాలు ప్రేక్షకులను అలరించాలని..
రెండూ విజయవంతం కావాలని కోరుకుంటున్నా. ఈ సంక్రాంతి తెలుగు సినీ ప్రేక్షకులకు మంచి విందు భోజనం కావాలని ఆశిస్తున్నా' అన్నారు.
మెగా స్టార్ చిరంజీవి తో పాటు మెగా హీరోలు కూడా గౌతమీపుత్ర మంచి విజయం సాధించాలని , సంక్రాంతి కి రిలీజ్ అవుతున్న ఈ రెండు చిత్రాలతో పాటు చిన్న చిత్రాలు కూడా మంచి విజయం సాధించి , అందరికి సంతోషాన్ని నింపాలని వారు కోరడం జరిగింది.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







