పసిపిల్లలపై వేధింపులు - 100 కేసుల నమోదు

- January 11, 2017 , by Maagulf

మస్కట్‌: 100కి పైగా కేసులు పసి పిల్లల వేధింపులకు సంబంధించి 2016లో నమోదయ్యాయి. హాట్‌లైన్‌ ద్వారా ఆరు నెలల్లో నమోదైన కేసులు ఇవి. మినిస్ట్రీ ఆఫ్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌ అధికారి ఒకరు ఈ వివరాల్ని వెల్లడించారు. వీటిల్లో లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులే ఎక్కువగా ఉన్నాయని తెలియవస్తోంది. మినిస్ట్రీ ఆఫ్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌ నిత్యం అందుబాటులో ఉండేలా ఉచిత హాట్‌లైన్‌ని ప్రారంభించింది. మినిస్టర్‌ ఆఫ్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌ షేక్‌ మొహమ్మద్‌ అల్‌ కల్బాని ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 2015లో ఈ హాట్‌లైన్‌ సాఫ్ట్‌-లాంఛ్‌ అయ్యింది. ఈ ఏడాది ఇప్పటివరకూ 100 కాల్స్‌ని మినిస్ట్రీ అందుకుందని, ప్రజల్లో అవగాహన పెరుగుతున్న దరిమిలా తమకు వచ్చే ఫిర్యాదుల సంఖ్య కూడా పెరుగుతోందని మినిస్ట్రీకి చెందిన ఫ్యామిలీ ప్రొటెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారి షామా అల్‌ హజ్రి చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com