3 నెలల చిన్నారి హత్య: జైల్లో జంట
- January 11, 2017
మనామా: మూడు నెలల చిన్నారి హత్య కేసులో నిందితులకు జైలు శిక్షను విధించింది హై క్రిమినల్ కోర్ట్. 21 ఏళ్ళ స్టెప్ మదర్‌కి మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించగా, మృతుడి తండ్రికి ఏడేళ్ళ జైలు శిక్షను ఖరారు చేసింది. భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత, బిడ్డను తనతోనే ఉంచుకున్నాడు నిందితుడు. ఆ వ్యక్తి నిందితురాలితో కలిసి జీవనం సాగించాడు. ఓ రోజు తలపై గాయాలతో చిన్నారిని ఆసుపత్రికి చేర్చారు వారిద్దరూ. కింద పడి గాయాలపాలయ్యాడని నిందితుడు చెప్పాడు. అయితే నిందితురాలి సమాధానం ఇంకోలా ఉండటంతో ఆసుపత్రి వర్గాలు అనుమానించాయి. అయితే బాబు చనిపోయాడు. దాంతో పోలీసులు కేసు విచారణలో భాగంగా ఇద్దరికీ ఫోరెన్సిక్ పరీక్షలు జరిపారు. ఈ పరీక్షల్లో మృతుడి తండ్రి, అలాగే పెంపుడు తల్లి నిందితులని తేలింది. దారుణంగా కొట్టి ఆ చిన్నారిని ఆ ఇద్దరూ చంపినట్లు నిర్ధారించారు.
తాజా వార్తలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్‌లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్‌లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ
- ప్రభుత్వ AI ఇండెక్స్..సౌదీ అరేబియా నెంబర్ వన్..!!
- స్మార్ట్‌ఫోన్ యూజర్స్ ను హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం
- యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి: గవర్నర్ హరిబాబు







