ఫ్రీ ఆఫర్‌: విమానయానం ఉచితంగా

- January 11, 2017 , by Maagulf
ఫ్రీ ఆఫర్‌: విమానయానం ఉచితంగా

ఎటిసలాట్‌ ఎక్స్‌క్లూజివ్‌ ఆఫర్‌ని తమ సబ్‌స్క్రైబర్స్‌ కోసం ప్రకటించింది. ఈ ఆఫర్‌ ప్రకారం ప్రకారం ఇ-లైఫ్‌ సబ్‌స్క్రైబర్స్‌ ఉచితంగా పలు దేశాలకు విమానయానం చేసే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఇది లిమిటెడ్‌ పీరియడ్‌ ఆఫర్‌. లండన్‌, ప్యారిస్‌, మరియు రోమ్‌ వంటి ప్రీమియమ్‌ డెస్టినేషన్లకు కూడా ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. ఇ-లైఫ్‌ స్పోర్ట్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, కాంబో లేదా ప్రీమియర్‌ ప్యాకేజీలకు సబ్‌స్క్రైబ్‌ అయ్యే వినియోగదారులే ఈ ఆఫర్‌కి అర్హులు. అమ్మాన్‌, ఏథెన్స్‌, బహ్రెయిన్‌, బీరట్‌, కైరో, కొచ్చిన్‌, కొలంబో, దమ్మామ్‌, ఢిల్లీ, దోహా, ఇస్తాంబుల్‌, కరాచీ, కీవ్‌, కువైట్‌, లండన్‌, మనీలా, మాస్కో, ముంబై, మస్కట్‌, ప్యారిస్‌, రియాద్‌, రోమ్‌, స్టాక్‌హోమ్‌ తదితర దేశాలకు ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. విజేతలు మేజర్‌ ఎయిర్‌లైన్‌ క్యారియర్స్‌ని తమ ప్రయాణాల కోసం వినియోగించుకోవచ్చు. యూఏఈలోని దుబాయ్‌, షార్జా మరియు అబుదాబీ నుంచి ప్రయాణాలు చేయొచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com