మస్కట్ ఉత్సవం ఈ ఏడాది 24 రోజులే... వచ్చే వారం నుంచి వేడుక ప్రారంభం

- January 11, 2017 , by Maagulf
మస్కట్ ఉత్సవం ఈ ఏడాది 24  రోజులే... వచ్చే వారం నుంచి వేడుక ప్రారంభం

మస్కట్ : సాధారణంగా నెలరోజుల పాటు కొనసాగే మస్కట్ ఉత్సవ వేడుక ఈ సంవత్సరం  24 రోజుల పాటు మాత్రమే జరగనుందని మస్కట్ మున్సిపాలిటీ మంగళవారం ప్రకటించింది. 2017 ఉత్సవం  జనవరి 19 వ తేదీ (గురువారం) నుండి ప్రారంభమై ఫిబ్రవరి 11 వ తేదీతో ముగుస్తుందని పురపాలక సంఘం యొక్క అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ సమాచారం తెలుపబడింది. ఈ పండుగను  అల్ నసీమ్ మరియు అల్ అమెరిట్ పార్కులు వద్ద నిర్వహించబడుతుంది. ఇక్కడ ఒక ఉష్ణమండల వానలు అడవులలో కురవడం , పెయింట్ బాల్ మరియు వైమానికపరంగా ఒక విద్యా ప్రదర్శన తదితర కొత్త కార్యకలాపాలు మస్కట్ ఉత్సవంలో ఉంటాయి. రెండు వేదికల వద్ద రోజూ బాణసంచాను కాలుస్తారు. థియేటర్ ప్రదర్శనలు సైతం ఇక్కడ ఏర్పాటుచేశారు. అంతే కాకుండా, ఒమన్ ఆటోమొబైల్ అసోసియేషన్ ఒక డ్రిఫ్టింగ్ కార్యక్రమమును నిర్వహించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com