పెరిగిన బంగారం, వెండి ధరలు
- January 11, 2017
బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర బుధవారం రూ.70లు పెరిగి 29,100కు చేరింది. అంతర్జాతీయ పరిణామాలు, దేశీయంగా వివాహ వేడుకల నేపథ్యంలో బంగారం వర్తకుల నుంచి కొనుగోళ్లు పెరగడంతో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. మరోవైపు వెండి ధరలు కూడా పెరిగాయి. పరిశ్రమలు, నాణేల తయారీదారుల డిమాండ్ కారణంగా కేజీ వెండి ధర రూ.550 పెరిగి 41,330కు చేరింది. ప్రపంచ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.29 శాతం పెరిగి 1190.70 డాలర్లకు చేరుకుంది. వెండి ధర 0.39 శాతం పెరిగి 16.82 డాలర్లకు చేరింది.
తాజా వార్తలు
- పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ
- రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు..
- మహిళా క్రికెటర్ల ఫీజుపెంచిన BCCI
- కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం
- ముహర్రక్ నైట్స్ ఫెస్టివల్ ను సందర్శించిన విదేశాంగ మంత్రి..!!
- కువైట్లో ఇన్క్రెడిబుల్ ఇండియా టూరిజం ప్రమోషన్స్..!!
- ఇబ్రిలో స్టంట్ డ్రైవింగ్..ఎనిమిది మంది డ్రైవర్లు అరెస్ట్..!!
- జంతువులను వదిలేస్తున్నారా? కఠిన చర్యలు..!!
- ఖలీద్ బిన్ అహ్మద్ ఇంటర్ఛేంజ్ ఎగ్జిట్ మూసివేత..!!
- తొలి ఆర్వీ రూట్ ను ప్రారంభించిన దుబాయ్..!!







