ఐటీ కన్నా నాన్‌ఐటీ హెచ్1బీ దెబ్బ..
- January 11, 2017
అమెరికా తీసుకున్న ఒక్క నిర్ణయం భారతలో వేల మంది 'అమెరికా' ఆశలను దెబ్బతీసింది. హెచ్1బీ వీసా నిబంధనల కఠినతరం వల్ల భారతలో ఐటీ కన్నా నాన్‌ఐటీ ఉద్యోగులే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. లక్ష డాలర్ల వార్షిక జీతం ఐటీ నిపుణులకు పెద్ద సమస్య కాదని.. ప్రతిభావంతులైన ఐటీ నిపుణులకు ఇచ్చేందుకు అమెరికా కంపెనీలు ఇప్పటికీ సిద్ధంగా ఉన్నాయని చెబుతున్నారు. కానీ ఐటీయేతర రంగాల వారికి ఏటా లక్ష డాలర్ల జీతం రావడం కష్టమని వీసా నిబంధనల మార్పుతో వీరే ఎక్కువగా ఇబ్బందిపడాల్సి ఉంటుందని వెల్లడించారు.
ఐటీ నిపుణులే కాకుండా పెద్దఎత్తున మార్కెట్ రీసెర్చ్ అనలి్స్టలు, ఆర్థిక సలహాదారులు, వెబ్ డెవెలపర్లు, ఆర్టి్‌స్టలు, మెడికోలు, నర్సులు, ఇతర పారామెడికల్ రంగానికి చెందిన వారు అమెరికా వెళ్తుంటారు. ఇప్పటి వరకూ హెచ్1బీ వీసాల ద్వారానే వీరు వెళ్లేవారు. కానీ ఇప్పుడు ఈ వీసా పొందాలంటే వార్షిక వేతనం లక్ష డాలర్లుగా నిర్ణయిస్తారు. పైగా మాస్టర్ డిగ్రీనీ తప్పనిసరి చేస్తారు. దీంతో ఐటీ రంగాల వారు లక్షడాలర్లు అందుకోగలరని.. కానీ తమకు అంత పెద్దమొత్తంలో అమెరికా జీతం అందడం కష్టమని ఐటీయేతర రంగాల వారు చెబుతున్నారు. ''అమెరికాలో చాలా సంస్థలు తక్కువ జీతానికి లభించే విదేశీ నిపుణులపైనే ఆధారపడతారు.
ఎక్కువ మంది మెడికోలు, మార్కెట్ అనలి్స్టలు, ఆర్థిక సలహాదారులు, కొందరు ఉపాధ్యాయులను బయటి నుంచే తీసుకుంటారు. వీరంతా హెచ్1బీ వీసాలతో వెళ్లేవారు. వీరికి లక్ష డాలర్ల వార్షిక జీతం అందుకోవడం చాలా కష్టం. దీంతో దేశంలో చాలా మంది ఐటీయేతరులు అమెరికాలో లక్ష డాలర్ల జీతం పొందడం ఎలా.. పొందకున్నా అమెరికాకు వెళ్లే మార్గాలు ఏవైనా ఉన్నాయా..'' అని ఆరా తీస్తున్నారని అను అటార్నీ లా సంస్థ న్యాయవాది అనూ పెషావరి చెప్పారు. తాజా నిబంధనల మార్పుతో అమెరికాకు వెళ్లదలచుకున్న నర్సులు, సలహాదారులు, ఇతరులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారని వివరించారు.
ఇతర మార్గాల్లో ప్రయత్నాలు
హెచ్1బీ వీసా నిబంధనల మార్పు తర్వాత చాలా మంది ఎల్1, ఈబీ5, ఓ1 కేటగిరీ వీసాల ద్వారా అమెరికాకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎల్1 వీసా మల్టీనేషనల్ కంపెనీల ద్వారా అమెరికా వెళ్లేందుకు ఉపయోగపడుతుంది. ఈ వీసా పొందాలంటే నిపుణులై ఉండాలి. సదరు సంస్థలో గత మూడేళ్లలో ఒక ఏడాదైనా ఉన్నతాధికారై ఉండాలి. ఈ వీసాతో అక్కడ గరిష్ఠంగా అయిదు నుంచి ఏడేళ్ల వరకు ఉండొచ్చు. ఇక రెండోది ఈబీ5 వీసా. డబ్బులున్న వారు ఈ వీసాతో వెళ్లగలరు. వీరు అమెరికాలో అయిదు లక్షల డాలర్ల నుంచి పది లక్షల డాలర్ల వరకు పెట్టుబడి పెట్టగలిగితే చాలు. మరోటి ఓ1 వీసా. ఇది సెలిబ్రిటీలు, ఆర్టిస్టులకు ఉద్దేశించిన వీసా. సైన్స్, ఆర్ట్స్, విద్య, వ్యాపారం, క్రీడలు, సంగీతం తదితర రంగాల్లో గుర్తింపు పొందిన వారికి ఈ వీసా ఇస్తారు. ప్రస్తుతం భారతలో ఎల్1, ఈబీ5 వీసాకు దరఖాస్తు చేసేవారి సంఖ్య బాగా పెరిగిందని ఇమిగ్రెంట్ లాయర్ మార్క్ డేవిస్ చెప్పారు. డబ్బులున్న వారు ఈబీ5 వీసా ద్వారా వెళ్లవచ్చని.. లేనివారు తమ ప్రతిభ ఆధారంగా ఎల్1 వీసా పొందొచ్చని వివరించారు. తాము చాలా మంది 'చెఫ్'లకు ఎల్ 1 వీసాతో అమెరికాకు వెళ్లేందుకు సాయం చేస్తున్నామని చెప్పారు. మొత్తానికి ట్రంప్ హయాంలో నైపుణ్యమున్న సిబ్బంది, కార్మికులకు ఇబ్బందులు తప్పవని ఆయన వివరించారు. ట్రంప్ విదేశాల నుంచి ఎక్కువ పెట్టుబడులను కోరుతున్నారని.. దీంతో ఈబీ5 వీసాలతో వెళ్లేవారికి భవిష్యత్తులో మార్గం మరింత సులభమవుతుందని చెప్పారు.
తాజా వార్తలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్‌లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!
- జెబెల్ జైస్‌లో బేర్ గ్రిల్స్ క్యాంప్ రీ ఓపెన్..!!
- భారత్ తో CEPA..ఆందోళనల పై స్పందించిన ఒమన్..!!
- బహ్రెయిన్ లకే వెహికల్ టెక్నికల్ ఇన్స్పెక్టర్ పోస్టులు..!!
- రియాద్ మెట్రో వార్షిక, టర్మ్ టిక్కెట్ల ధరలు వెల్లడి..!!
- 2026 సంవత్సర క్యాలెండర్, డైరీని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
- తెలంగాణలో వారందరికీ బిగ్‌షాక్..
- తొలి మూడు రోజులు టోకెన్లున్న భక్తులకే వైకుంఠ దర్శనం:టి.టి.డి చైర్మన్
- పిపిపి మోడల్ సరైనదే: మంత్రి పార్థసారథి







