శంషాబాద్ ఎయిర్‌పోర్టులో హై అలర్ట్..
- January 11, 2017
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుధవారం నుంచి ఈ నెల 31 వరకు హై అలర్ట్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టు ప్యాసింజర్ టెర్మినల్, కార్గో టెర్మినల్, పార్కింగ్ ప్రాంతాల్లో సీఐఎస్‌ఎఫ్, డాగ్‌స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. శంషాబాద్ నుంచి ఎయిర్‌పోర్టు వైపునకు వచ్చే ప్రధాన రహదారితో పాటు అరైవల్, డిపార్చర్లకు వెళ్లే దారుల్లో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటుచేశారు. పార్కింగ్‌లో నిలిపిన వాహనాలపై ప్రత్యేకంగా నిఘా పెట్టారు.
హజ్ టెర్మినల్, కార్గో టెర్మినల్, వీవీఐపీ గేటు, వీవీఐపీ పార్కింగ్, ఎయిర్‌సైడ్, రోటరీ చౌరస్తా, నోవాటెల్, స్పోర్ట్ ఎరీనా, ఏరో ఏరియా ప్రాంతాల్లో విస్తృతంగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ USA ఆధ్వర్యంలో ఘనంగా సాంస్కృతిక నిధి సమీకరణ కార్యక్రమం
- రైల్వే శాఖ కీలక నిర్ణయం...
- శంకర నేత్రాలయ USA ఆధ్వర్యంలో ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలు
- వయనాడులో పబ్లిక్ అకౌంట్స్ కమిటి సమావేశంలో పాల్గొన్న ఎంపీ బాలశౌరి
- వైఎస్ జగన్‌కు అస్వస్థత.. పులివెందుల కార్యక్రమాల రద్దు
- ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం, ఫ్లూ షాట్ డ్రైవ్
- ఏపీ ప్రభుత్వం మరో బిగ్ డెసీషన్..
- విబిజీ రామ్జీతో గ్రామాల్లో నవశకం: ఎంపీ డి.కె అరుణ
- రాచకొండ సుధీర్ బాబుకు అదనపు డిజిగా పదోన్నతి







