ఐడియా,ఎయిర్‌టెల్, వొడాఫోన్ కు భారీ జరిమానా

- January 12, 2017 , by Maagulf
ఐడియా,ఎయిర్‌టెల్, వొడాఫోన్ కు భారీ జరిమానా

సేవా నిబంధనల విషయంలో నాణ్యతను విస్మరించినందుకు భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్‌లకు సంచిత శిక్ష చర్య కింద ట్రాయ్ విధించిన రూ.3,050 కోట్ల జరిమానా చెల్లింపుల విషయంలో అడ్డంకులు తొలగిపోయాయి. జరిమానాలు విధించే అధికారం డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికం(డీవోటీ)కి ఉందని అటార్నీ జనరల్ అభిప్రాయపడ్డారు. దీంతో ఇప్పుడు ఆయా కంపెనీలు జరిమానా నుంచి తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. క్వాలిటీ ఆఫ్ సర్వీస్ రూల్స్‌ను అతిక్రమించిన ఎయిర్‌టెల్, వొడాఫోన్‌లకు ఒక్కోదాని నుంచి రూ.1,050 కోట్ల చొప్పున జరిమానా వసూలు చేయాల్సిందిగా ప్రభుత్వానికి ట్రాయ్ ప్రతిపాదనలు పంపింది. అలాగే ఐడియాకు రూ.950 కోట్ల జరిమానా విధించింది.

ఈ మూడు కంపెనీలు నిబంధనలు అతిక్రమించడంతోపాటు రిలయన్స్ జియోకు ఇంటర్ కనెక్ట్ పాయింట్ల విషయంలో వీటిపై ఆరోపణలు ఉన్నాయి. ట్రాయ్ జరిమానాల ప్రతిపాదన నేపథ్యంలో టెలికం డిపార్ట్‌మెంట్ అటార్నీ జనరల్ అభిప్రాయం కోరింది. ఇంటర్ కనెక్ట్ పాయింట్లు ఇవ్వకపోవడంతో తమ నెట్‌వర్క్ నుంచి వెళ్తున్న 75 శాతం కాల్స్ డ్రాప్ అవుతున్నాయంటూ రిలయన్స్ జియో ట్రాయ్‌ను ఆశ్రయించడంతో ఈ కేసు మొదలైంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com