200ఏళ్లుగా పద్మాసనంలోనే ఆ సన్యాసి

- January 12, 2017 , by Maagulf
200ఏళ్లుగా పద్మాసనంలోనే ఆ సన్యాసి

ఒకటికాదు రెండు కాదు.. ఏకంగా 200ఏళ్లుగా ఆయన పద్మాసనంలోనే కూర్చున్నారు. అందరూ చనిపోయారని అనుకున్నా.. ఆయన ఘాఢమైన ధ్యానంలో ఉన్నట్లు తాజాగా తేల్చారు. ఆయనే మంగోలియాలో నిరుడు వెలుగుచూసిన మమ్మీఫైడ్ బౌద్ధ సన్యాసి. కాగా, ఆయన దాదాపు రెండు శతాబ్దాల నాటి మమ్మీ అని ఫోరెన్సిక్ నిపుణులు చెబుతుండగా... బౌద్ధుల వాదన మాత్రం మరోలా ఉంది.

ఆయన చనిపోలేదనీ.. ధ్యానంలో ఉచ్ఛ స్థితికి చేరుకోవడం వల్లే అలా ఉన్నారని చెబుతున్నారు. ఈ స్థితిని టుక్డమ్ అని పిలుస్తారనీ, ఈ దశ దాటితే ఆయన నిజమైన బుద్దుడిగా మారినట్టేనంటున్నారు. అలా మారినవారు ఇతరులను సైతం బాగుచేయగలరని వారు నమ్ముతున్నారు.
టుక్టమ్ దశలో గుండె చాలా నెమ్మదిగా కొట్టుకుంటుందని, బతకడానికి మాత్రమే శరీరంలో శక్తి ఉంటుందని ప్రఖ్యాత బౌద్ధ సన్యాసి, దలైలామాకు ఫిజిషియన్ అయిన డా.

బెర్రీ కీర్జిన్ తెలిపారు.
కాగా, 2015 జనవరిలో కొందరు వ్యక్తులు బ్లాక్ మార్కెట్లో అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా మంగోలియా అధికారులు ఈ మమ్మీని స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యక్తి 200 యేళ్ల క్రితం జీవించాడని గుర్తించిన ఫోరెన్సిక్ నిపుణులు... ఇప్పటికీ ఆయన దేహంపై పరిశోధనలు కొనసాగిస్తూనే ఉన్నారు.
జంతుచర్మంతో శరీరం పాడవకుండా భద్రపరచగలగడం.. ఇప్పటికీ కూర్చున్ని దేహం కూర్చున్నట్టుగానే ఉండటం నిపుణులైన శాస్త్రవేత్తలకు సైతం అంతుచిక్కడం లేదు. 
ఇది ఇలా ఉండగా, పద్మాసనంలో కూర్చుని ధ్యానం చేస్తున్నట్టున్న ఈ మమ్మీని.. బుర్యాత్ బుద్ధ సన్యాసి లామా దాషి లిటిగిలోవ్‌ అని మరికొంతమంది చెబుతున్నారు.
అయితే, ఉపాధ్యాయుడిగా పనిచేసిన ఆయన 1927లో చనిపోయారు. కాగా, 200 యేళ్లుగా శరీరంలో ఎలాంటి మార్పు చోటు చేసుకోనందున దీనిని ఆథ్యాత్మిక మిస్టరీగానే భావించాలనీ, ఈ మిస్టరీని శాస్త్రవేత్తలు పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com