బేసిన్ గట్టారో
- January 12, 2017
కావాల్సిన పదార్థాలు: సెనగపిండి -150 గ్రాములు, ఎండబెట్టిన మెంతికూర - రెండు టేబుల్ స్పూన్లు, నూనె -తగినంత, పసుపు - చిటికెడు, పెరుగు - రెండు టేబుల్ స్పూన్లు, వాము - అర టీ స్పూను, ఉప్పు -తగినంత, మిరియాల పొడి - అర టీ స్పూను, కారం - అర స్పూను, సోంపు - అర టీ స్పూను.ధనియాల పొడి - ఒక టీ స్పూను, జీలకర్రపొడి - ఒక టీ స్పూను, ఆవాలు - అర టీ స్పూను, జీడిపుప్పు - ఒక టేబుల్ స్పూను.
తయారుచేసే విధానం: శెనగపిండిలో మెంతికూర, పసుపు, పెరుగు, వాము, ఉప్పు, మిరియాలపొడి, ఉప్పు, కారం, తగినన్ని నీళ్లు పోసుకుని కలుపుకోవాలి. దీన్ని ఒకసారి కుక్కర్లో ఉడికించుకోవాలి. చల్లారిన తర్వాత దీన్ని గొట్టాలు చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని నూనె వేయించుకుని పక్కనపెట్టుకోవాలి. మరో గిన్నెలో నూనె వేసి అందులో ఆవాలు, జీలకర్రపొడి, జీడిపప్పు పొడి, ఉప్పు, కారం వేసి వేయుంచాలి. అందులోనే పెరుగు, కొద్దిగా నీళ్లుపోసి ఉడికించాలి. ఇది దగ్గరికయ్యాక వేయించిపెట్టుకున్న ముక్కల్ని ఇందులో వేసి కలపాలి. బేసిన్ గట్టారో రెడీ.
తాజా వార్తలు
- తెలంగాణలో మార్పు మొదలైంది: కేటీఆర్
- ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మహిళా కమిషన్ విచారణలో శివాజీ క్షమాపణలు
- బ్యాంక్ సెలవుల జాబితా విడుదల
- చైనా: ప్రపంచంలోనే అతిపొడవైన టన్నెల్
- మనమా-దియార్ అల్ ముహారక్ మధ్య కొత్త బ్రిడ్జి..!!
- ఉగ్రవాదుల బాంబు దాడిని ఖండించిన ఖతార్..!!
- ప్రవాస కార్మికుల ఫుడ్ స్క్రీనింగ్ కేంద్రాలలో తనిఖీలు..!!
- ఫుడ్ ట్రక్ స్టార్టప్లకు మద్దతుగా మసార్ ప్రారంభం..!!
- కత్తితో దాడి..6 మందికి జైలు శిక్ష, బహిష్కరణ వేటు..!!







