భోగిపీడ వదలడానికి - భోగి పండుగ..

- January 12, 2017 , by Maagulf
భోగిపీడ వదలడానికి - భోగి పండుగ..

సంక్రాంతి పండగ  భోగితో ప్రారంభమవుతుంది. ఈ పండుగను పట్టణ ప్రాంతాల్లోని పలు కూడళ్ల వద్ద ఆర్భాటంగా నిర్వహిస్తారు.  భోగి పండుగలో పాల్గొనేందుకు యువత ఉత్సాహం చూపుతున్నారు. పట్టణాల్లో పల్ల్లె పండుగ వాతావరణం ఉట్టి పడుతోంది. మంటలోల రాగికాని, ఆవుపేడతో చేసిన పిడకలు వేసి ఇంటిల్లిపాదీ స్నానం చేయడం ఆనవారుుతీ. ఇంట్లో చిన్నారులు ఉంటే వారిని కూర్చోబెట్టి రేగుపళ్లు, చిల్లరనాణేలను కలిపి తలమీద పోసి పెద్దలు ఆశీర్వదిస్తారు. ముత్తరుుదవులను ఇంటికి పిలిచి పసుపు ముఖానికి రాసి పేరంటాలుగా కొలుస్తారు. చదువు, ఉద్యోగాలు, వ్యాపారాల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లి వచ్చిన వారితో పట్టణాలు కళకళలాడుతున్నారుు. పట్టణంలోని పలు కూడళ్లలో పిచ్చాపాటి మాటలు, ఆత్మీయ పలకరింపులు, కష్టసుఖాలు చెప్పుకుంటూ కాలం తెలియకుండా గడిపేస్తున్నారు
భోగినాడు తెల్లవారగట్లనే లేచి, అభ్యంగన స్నానం చేయడం విధాయకకృత్యం. ఆ స్నానంతో భోగిపీడ వదులుతుందని నమ్ముతారు.చంటి పిల్లలకు భోగిపీడ కేవలం తలంటుతోనే కాక మధ్యాహ్నం 'భోగి పళ్ళు పోయడంతో కాని వదలదంటారు. ఈ భోగిపళ్లు పోయడమనేది దృష్టిపరిహారార్థం చేసే కర్మగా కనిపిస్తుంది.చంటిపిల్లలకు కొత్తదుస్తులు తొడుగుతారు. కుర్చీ మిూద కూర్చోపెడతారు. రేగుపళ్లపైసలు, చెరుకు ముక్కలు బంతిపూలు కలిపి తలవిూద నుంచి దిగువారపోస్తారు. దీనిని బోడికలు పోయడం అనిన్నీ కొన్నిప్రాంతాల్లో అంటారు. ఇట్లా చేయడం ఆపిల్లలకు ఆయుర్వృద్దికరమై ఉంటుందని ఆంధ్రస్త్రీల నమ్మిక, భోగిపండుగనాడు తమిళనాట విందు భోజనాలు విరివిగా సాగుతాయి. ఆనాడు సాధారణంగా ప్రతివారు పులగం వండుకుంటారు.అందరూ విరివిగా ఆటల్లో పాల్గొంటారు. తమిళనాడులో గ్రామ ఉమ్మడి స్థలాన్ని మండైవెలి అంటారు. ఆనాడు గ్రామస్తులందరూ అక్కడ చేరుతారు. అందరూ పల్లెటిపటు ఆటల్లో పాల్గొంటారు. భోగిరోజు జరిగే మరో ఉత్సవం బొమ్మల కొలువు. సంక్రాంతి, దసరా తదితర పండగల సమయంలో చిన్నపిల్లలను ఆకర్షించేందుకు బొమ్మల కొలువులు నిర్వహిస్తున్నారు. ఏడాది పొడవునా సేకరించిన బొమ్మలను జాగ్రత్తగా భద్రపరిచి దసరా,సంక్రాంతి సమయాలలో బొమ్మలకొలువులు పెడుతున్నారు.యువతులు మన సంప్రదాయాలకు గుర్తుగా లంగావాణీ లు ధరించి జడగంటలు, తల పై పాపిడిపిందె, జడలో చామంతి పువ్వతో తెలు గింటి ఆడపచులా ముస్తాబులకు ప్రాధాన్యమిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com