సంక్రాంతి సంక్రాంతి - మది పొంగే ఘన క్రాంతి!!

సంక్రాంతి సంక్రాంతి - మది పొంగే ఘన క్రాంతి!!

పౌష్య లక్ష్మి ఫల సంక్రాంతి

పచ్చని మొలకల విక్రాంతి   

     ---00-- 
పాల పొంగుల, పూల బంతుల 
రంగుల ముగ్గుల తోరణమ్ముల 

వాకిట వెలసిన గొబ్బి పాటల 
వెలుగులజిమ్మే దీపపు బాటల 

జియ్యరు పాటల, ధాన్యపు మూటల 
గంగిరెద్దుల గెంతులాటల

ఇంటి ముంగిట భోగిమంటల 
పసిడి పంటల, పిల్లలాటల

మకర సంక్రాంతిన పుణ్య పథమ్ముల 
కనుమను పనిముట్లకు తగు పూజల 

పిల్లల పెద్దల గాలిపటమ్ముల - 
పోటీ వేటుల, జోరు పాటల 

నూతన వస్త్రాభరణములెల్ల 
నిండుగ మ్రోయగ ఉత్సాహమ్ముల  

ఎద్దుల బండ్ల బారుల తీరుల 
బసవన్నల మెడ గంటల మోతల 

సూర్యుని శనిదేవుని బహు పూజల
కొలిచెడు దినమిది సంక్రాంతి... సంక్రాంతి ... సంక్రాంతి
శుభములబడసెడు సంక్రాంతి ... సంక్రాంతి ... సంక్రాంతి

 

--రవీంద్ర బోగారం(డల్లాస్,యు.యస్.ఏ)

Back to Top