వివిధ రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని గురించి మిత్రదేశాలైన ఒమాన్- చైనా చర్చలు
- September 12, 2015
సుల్తానెట్ ఆఫ్ ఒమాన్ మరియు పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాల విదేశాంగ శాఖల మంత్రుల మధ్య తొమ్మిదవ దఫా వ్యూహాత్మక చర్చలు నిన్న మస్కట్ పట్టణంలో జరిగాయి. ఒమాన్ విదేశాంగ శాఖ తరపున సెక్రటరీ జనరల్ సైయిద్ బద్ర్ బిన్ హమాద్ బిన్ హమౌద్ అల్ బుసైదీ, చైనా తరపున విదేశీ వ్యవహారాల ఉపమంత్రి ఝాంగ్ మింగ్ ప్రాతినిధ్యం వహించి, వాణిజ్యం, పెట్టుబడులు, సంస్కృతి, ఆర్ధిక మరియు ఇరు మిత్ర దేశాలకు, ప్రజలకు ఆసక్తికరమైన మరిన్ని విషయాలపై ద్వైపాక్షిక సహకారం, దానిని పెంపొందించుకునే విధానాలపై చర్చలు జరిపారు.
ఇరుదేశాలకు సంబంధించిన ఉమ్మడి అంతర్జాతీయ అంశాలపై తమ అభిప్రాయాల మార్పిడి చేసుకుంటూ, ప్రపంచ దేశాల మధ్య శాంతి, స్థిరత్వాన్ని కొనసాగించడానికి అవసరమైన అన్ని శాంతియుత విధానాలను, సహకారాన్ని బలోపేతం చేయవలసిన ఆవస్యకతను నొక్కి చెప్పారు. ఇంకా ఈ సమావేశంలో, ఆర్ధిక వ్యవహారాల శాఖ అధికారి - షేక్ యాహ్యా బిన్ అబ్దుల్లా అల్ ఫన్నా, చైనా రాయబారి మరియు ఇరుదేశాల విదేశాంగ శాఖల అధికారులు పాల్గొన్నారు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- కువైట్‌లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్‌కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్‌లో ఉద్యోగాలు..









