బిహార్ రాజధానిలో పడవ బోల్తా: 18 మంది మృతి

- January 14, 2017 , by Maagulf
బిహార్ రాజధానిలో పడవ బోల్తా: 18 మంది మృతి

బిహార్ రాజధాని పాట్నాలో శనివారం ఘోర ప్రమాదం సంభవించింది. గంగానదిలో 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తాపడింది. ఈ ఘటనలో 18 మంది మృతిచెందగా మిగతా ప్రయాణికులు గాయపడ్డారు. కైట్ ఫెస్టివల్ కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న రెవెన్యూ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు రంగంలోకి సహాయక చర్యలను ముమ్మరం చేశారు. పడవలో పరిమితికి మిచ్చి ప్రయాణికులు ఎక్కడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు సమాచారం. బిహార్ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.4లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. మృతుల్లో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల కుటుంబాల్లో విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com