శామ్‌సంగ్ వైస్ ఛైర్మన్ జె యంగ్ లీ అరెస్ట్ కి రంగం సిద్ధం
- January 15, 2017
దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శామ్‌సంగ్ వైస్ ఛైర్మన్(వీసీ) జె యంగ్ లీని గడ్డుకాలం ఎదుర్కొంటున్నారు. దేశాధ్యక్షురాలి అవినీతి కుంభకోణంలో ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. దీంతో ఆయనను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. దీనిలో భాగంగా లీని అరెస్టు చేస్తే ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకున్నట్లు కొరియా స్పెషల్ ప్రాసిక్యూటర్ తెలిపారు. దీనిపై ఆదివారం తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ లోపు దర్యాప్తు అధికారులు ఆయన అరెస్టు ప్రభావంపై నివేదిక ఇస్తారు. ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావాన్ని కూడా పరిశీలిస్తారు. జే యంగ్ లీ 2015లో దాదాపు రూ.175కోట్లు విలువైన సొమ్మును ప్రస్తుత అధ్యక్షురాలు పార్క్ జియోన్ హైస్‌కు చెందిన సంస్థకు బదలాయించారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







