ఎస్పీ బీ 50 ఇయర్స్ గ్రాండ్ యూఎస్ టూర్ 2017
- January 16, 2017
ఎస్.పి.బాలసుబ్రమణ్యం.. అలియాస్ బాలు తన సుమధుర గానంతో సంగీత ప్రపంచంలో శ్రోతలను ఉర్రూతలూగించిన గాన గంధర్వుడు. ఎస్పీ బాలసుబ్రమణ్యం కేవలం గాయకుడిగానే కాదు ప్రేక్షకులను అలరించింది.. నటుడిగా డబ్బింగ్ కళాకారుడిగా.. వ్యాఖ్యాతగా సంగీత దర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలి అని అందరితోనూ ప్రశంసలను అందుకొన్న గొప్ప వ్యక్తి.. 11 భాషల్లో సుమారు 40 వేలకు పైగా పాటలను ఆలపించిన బాలు గాయకుడిగా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించి 50 ఏళ్ళు పూర్తి చేసుకోబోతున్నారు.. ఈ సందర్భంగా బాలు తన సినీ ప్రయాణ మధుర స్మృతులను అందరితోనూ పంచుకోవడానికి రెడీ అవుతున్నాడు.. ఈ సందర్భంగా "ఎస్పీ బీ 50 ఇయర్స్ గ్రాండ్ యూఎస్ టూర్ 2017" టీజర్ ని రిలీజ్ చేశారు.. పాట ఏ ఒక్కరి సొంతం కాదు అందరి ఆస్తి ... నా మొదటి పాట రికార్డ్ చేస్తున్న సమయంలో నా సంగీతం 50 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం చేయనిస్తుంది అని నేను అనుకోలేదు అని చెప్పారు.. ఈ 50 ఏళ్ల ప్రయాణం మీరు లేకుండా సాధ్యం కాదు... కాగా 50 ఏళ్ల జ్ఞాపకాలను మళ్ళీ మొదలు పెట్టాలని అనుకుంటున్నాను అని బాలు తెలిపారు.. మళ్ళీ మీతోనే మీ ఎస్పీ బలాసుబ్రమణ్యం అంటూ టీజర్ తో తన టూర్ కు సంబందించిన విషయాలను వెల్లడించారు.. ఈ టూర్ 2017 మార్చి , ఏప్రిల్ మధ్య జరగనున్నది.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









