హీరోగా రానున్న సుకుమార్ అన్న కొడుకు అశోక్‌

- January 16, 2017 , by Maagulf
హీరోగా రానున్న సుకుమార్ అన్న కొడుకు అశోక్‌

ప్రముఖ సినీ దర్శకుడు బండ్రెడ్డి సుకుమార్‌ ఇంటి నుంచి ఆయన పెద్ద సోదరుడు బండ్రెడ్డి వెంకటేశ్వరరావు కుమారుడు అశోక్‌ తెలుగు తెరకు కొత్త హీరోగా పరిచయం కాబోతున్నారు. సుకుమార్‌ మరో సోదరుడు బీఎన్‌సీఎస్పీ విజయ్‌కుమార్‌, థామస్‌రెడ్డి నిర్మాతలుగా సుకుమార్‌ రైటింగ్స్‌ నుంచి బీటీఆర్‌ క్రియేషన్స్‌ పతాకంపై నిర్మిస్తున్న 'దర్శకుడు' (హెర్‌ లవ్‌.. హిజ్‌ పేషన్‌.. అనే ఉపశీర్షికతో) సినిమాలో అశోక్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలను సుకుమార్‌, ఆయన సోదరుడైన నిర్మాత విజయ్‌కుమార్‌లు స్థానిక విలేకర్లకు వెల్లడించారు.

అశోక్‌ సరసన 'అంతకు ముందు.. ఆ తర్వాత' సినిమాలో హీరోయిన్‌గా నటించిన ఇషా కథానాయకగా నటిస్తోందన్నారు. తన వద్ద అసిస్టెంటు డైరెక్టరుగా పనిచేసిన హరిప్రసాద్‌ ఈ సినిమాకు దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారని సుకుమార్‌ చెప్పారు. సాయికార్తీక్‌ సంగీతాన్ని సమకూర్చారన్నారు. సినీరంగంలో ఉండే దర్శకుడు ప్రేమలో పడితే జరిగే పరిణామాల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుందన్నారు. ఈ సినిమా చిత్రీకరణ మరో నాలుగైదు రోజుల్లో పూర్తి చేసుకొంటుందని, మార్చి నెలాఖరులోగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com