దుబాయ్‌లో ఉచితంగా రెంట్‌ ఎ కార్‌!

- January 18, 2017 , by Maagulf
దుబాయ్‌లో ఉచితంగా రెంట్‌ ఎ కార్‌!

హవర్లీ కార్‌ రెంటల్‌ స్మార్ట్‌ సర్వీస్‌ ప్రకటన అనంతరం యు డ్రైవ్‌, ఫ్రీ రెంటల్‌ క్యాంపెయిన్‌పై ప్రకటన చేసింది. 'యు డ్రైవ్‌ ఫర్‌ ఫ్రీ' క్యాంపెయిన్‌ ద్వారా రెసిడెంట్స్‌ మరియు విజిటర్స్‌ ఉచితంగా నెల రోజులపాటు ఫ్రీ మెంబర్‌ షిప్‌ పొందవచ్చు. దీనికిగాను కాంప్లిమెంటరీగా గంటపాటు ఉచిత డ్రైవ్‌ పొందే వీలుంది. పార్కింగ్‌ మరియు ఫ్యూయల్‌ కాస్ట్‌ కూడా ఇందులో ఉచితం. అలాగే యు డ్రైవ్‌, తమ మెంబర్స్‌కి ప్లేస్‌ ఆఫ్‌ రిటర్న్‌ మరియు టైమ్‌ని ముందుగానే చెప్పకుండా వాహనాల్ని అద్దెకు తీసుకునే అవకాశం కల్పిస్తోంది. యు డ్రైవ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ హసీబ్‌ ఖాన్‌ మాట్లాడుతూ, కార్‌ షేరింగ్‌ ముందు ముందు సరికొత్త సంచలనాలకు కారణమవుతుందని అన్నారు. యు డ్రైవ్‌ కార్స్‌, మొబైల్‌ యాప్‌ ద్వారా కూడా బుక్‌ చేసుకోవచ్చు. 
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com