భారీగా బంగారం పట్టివేత ఎయిర్‌పోర్టులో...

- January 19, 2017 , by Maagulf
భారీగా బంగారం పట్టివేత ఎయిర్‌పోర్టులో...

శంషాబాద్‌: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో ఓ వ్యక్తి నుంచి 467 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సదరు ప్రయాణికుడు మస్కట్‌ నుంచి ఒమర్‌ ఎయిర్‌లైన్స్‌ డబ్ల్యువై-235 విమానంలో హైదరాబాద్‌ వచ్చాడు. కస్టమ్స్‌ అధికారుల తనిఖీల్లో చేపట్టగా బంగారం పట్టుబడింది. పట్టుకున్న బంగారం విలువ రూ.13.64 లక్షలు అని అధికారులు తెలిపారు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com