ఐటీ ఉద్యోగులకు మరో షాక్!...
- January 20, 2017
హెచ్1బీ వీసా నిబంధనలు మరింత కఠినతరం
అక్కడ వర్సిటీల్లో చదివినవారికే ప్రాధాన్యం
వాషింగ్టన్: అమెరికా భారత ఐటీ వర్గాలకు మరో షాకివ్వనుంది. హెచ్1బీ వీసా నిబంధనలు మరింత కఠినతరం చేస్తూ కీలక బిల్లు తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. దీనికి చట్టబద్ధత తెచ్చే దిశగా సెనేటర్లు చుక్ గ్రాస్లే, డిక్ డర్బన్ సన్నాహాలు చేస్తున్నారు. దీని ప్రకారం అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదివిన విదేశీయులకే హెచ్1బీ వీసాల జారీలో తొలి ప్రాధాన్యం ఇస్తారు. అలాగే అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పట్టభద్రులు, అధిక వేతనం పొందే నిపుణులకు కూడా అవకాశం ఇస్తారు.
'అమెరికాలో అత్యున్నత స్థాయి శ్రామిక శక్తిని నింపడానికే ఈ ప్రతిపాదన. దురదృష్టవశాత్తూ ఇక్కడి కంపెనీలు అమెరికన్లను కాదని తక్కువ వేతనానికి వస్తున్న విదేశీయులను తెచ్చుకొంటున్నాయి. విదేశీ నిపుణుల కోసం బయటి ఉద్యోగుల కంటే ఇక్కడ చదివిన వారికే మొదట అవకాశం కల్పిస్తాం'అని సెనేటర్లు వెల్లడించారు. అలాగే 50 కంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న ఔట్‌సోర్స్ కంపెనీలు అదనంగా హెచ్1బీ/ఎల్1 వీసాలున్నవారిని నియమించుకోవడానికి కూడా నిబంధనలు అనుమతించవు.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!







