మూడు రెట్లు పెరుగుదల సైబర్ దాడుల విషయంలో...
- January 20, 2017
మనామా: కింగ్డమ్ లో హ్యాకింగ్ ప్రభుత్వ సంస్థలపై ప్రయత్నాలు మూడు రెట్లు పెరుగుదల అధికంగా ఉందని అక్కడ సమాచార,ఈ - గవర్నమెంట్ అథారిటీ ( ఐ జి ఎ ) తెలిపింది. ఉపయుక్తకరమైన డేటా భద్రత రెండవ సైబర్ హాక్స్ సమావేశం కేపీఎంజీ ఫ్యాక్రో సహకారంతో ఈ- గవర్నమెంట్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బహ్రెయిన్ ప్రభుత్వ వ్యవస్థలపై హ్యాకింగ్ ప్రయత్నాలు ప్రముఖంగా పేర్కొన్నారు. ఈ - గవర్నమెంట్ అథారిటీ ( ఐ జి ఎ ) సమాచార భద్రత నిపుణులు విజయవంతంగా 107 మిలియన్ కంటే ఎక్కువ హానికరమైన ఇమెయిల్స్ తో వ్యవహరించారు. 2015 సంవత్సరంతో సరి పోలిస్తే 167,000 ప్రయత్నాలు హ్యాకింగ్ కంటే ఎక్కువ ప్రయత్నాలు 2016 లో జరిగినట్లు కనుగొనబడిందని నిపుణులు తెలిపారు.ఈ సమావేశంలో ప్రదర్శించబడిన గణాంకాల ప్రకారం, ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన రక్షించబడిన డేటా 2015 సంవత్సరంతో సరిపోలిస్తే, 2016 లో 1,046.6 టి బి కి చేరుకొని 12.4 శాతం పెరిగింది.అయితే ఉద్యోగులలో 20 శాతం మంది ఇతరులతో వారి పాస్‌వర్డ్‌లను తెలియచేసినట్లు దీంతో ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన సమాచారం సైతం బహిర్గతమై ప్రదర్శించబడినట్లు వెల్లడైంది. అదేవిధంగా,44 శాతం ఇ మెయిల్స్ కు సంబంధించి పంపినవారి ఆనవాలు ( సోర్స్ ) తెలియకుండా స్వీకరించబడినట్లు తెల్సింది. పని గంటల వేళలో ఇంటర్నెట్ అన్వేషణలో ఉండగా, 17 శాతం మంది వారు అందుకున్న హ్యాకింగ్ దాడుల గురించి ఐటి శాఖకు పిర్యాదు చేయడానికి చొరవ తీసుకోలేదు. అలాగే, ప్రభుత్వ ఉద్యోగుల పని ఫైళ్లు13 శాతం వరకు బాహ్య డేటా మెమరీ (యు ఎస్ బి) ద్వారా బదిలీ కాబడినట్లు తెలిపారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డైరెక్టర్ జనరల్ షేక్ సల్మాన్ బిన్ మొహమ్మద్ అల్ ఖలీఫా అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. సమాచార భద్రత రంగంలో నిపుణులతో పాటు 56 ప్రభుత్వ మరియు ఉప ప్రభుత్వ సంస్థలకు చెందినవారు హాజరయ్యారు. షేక్ సల్మాన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, 2017 ప్రాజెక్టుల ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కల్పించాలని ,రాష్ట్ర సమాచార మరియు పత్రాలు చట్టం రక్షణ మరియు ఉపకరణాల అమలును కొనసాగించాలని కోరారు.ఇందుకోసం కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ ఎంతో కీలక పాత్రను పోషించాలని ఆయన ప్రసంగించారు. ఈ - గవర్నమెంట్ అథారిటీ ( ఐ జి ఎ ) సైతం సైబర్ ట్రస్ట్ కార్యక్రమం అమలు కోసం పనిచేస్తోంది, మరియు ప్రభుత్వ సంస్థలలో ఉద్యోగుల కోసం పలు కార్ఖానాలు ( వర్క్ షాప్ లు ) నిర్వహించి ప్రభుత్వం భద్రతా అవగాహన కార్యక్రమాల గూర్చి వారికి అవగాహనను కల్పిస్తుంది. ఈ తరహా సమావేశం షేక్ సల్మాన్ రెండవ సారి నిర్వహించడం ద్వారా ఈ - గవర్నమెంట్ అథారిటీ ( ఐ జి ఎ ) ప్రాజెక్టులకు సమాచార భద్రతకు మద్దతుని ఇస్తూ, ఎదరయ్యే సవాళ్లు పరిష్కరించుకొంటూ అవకాశాలకు ప్రాధాన్యతను ప్రతిబింబిస్తుంది.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









