ఫేక్‌ పిహెచ్‌డి డిగ్రీ: వలసదారుడికి జైలు

- January 21, 2017 , by Maagulf
ఫేక్‌ పిహెచ్‌డి డిగ్రీ: వలసదారుడికి జైలు

దోహా క్రిమినల్‌ కోర్ట్‌, జోర్డాన్‌కి చెందిన ఓ వ్యక్తికి మూడేళ్ళ జైలు శిక్ష విధించింది. శిక్ష అనంతరం డిపోర్టేషన్‌ కూడా చేయబడతాడు ఆ వ్యక్తి. జోర్డాన్‌ యూనివర్సిటీ నుంచి పిహెచ్‌డి పొందినట్లుగా రెండు ఫేక్‌ డాక్యుమెంట్లు సృష్టించినందుకుగాను ఈ శిక్ష విధించింది న్యాయస్థానం. అటెస్టేషన్‌ డిపార్ట్‌మెంట్‌లో నిందితుడు ఐదు సర్టిఫికెట్లను సమర్పించాడు. ఖతార్‌ మినిస్ట్రీ ఆఫ్‌ ఫారిన్‌ ఎఫైర్స్‌ ఉద్యోగి, వీటిల్లో రెండిటిని ఫోర్జరీ చేసినట్లుగా గుర్తించాడు. విచారణలో నిందితుడ్ని దోషిగా తేల్చారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com