తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో ఆదివారం జల్లికట్టును నిర్వహించారు..
- January 22, 2017
చెన్నై : తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో ఆదివారం జల్లికట్టును నిర్వహించారు. తిరుచిరాపల్లి సహా చాలా చోట్ల సంప్రదాయబద్ధంగా ఎద్దులతో పోరాడారు. విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి అళంగనళ్ళూరులో జల్లికట్టును ప్రారంభించవలసి ఉంది. కానీ అక్కడి ప్రజలు తమకు శాశ్వత పరిష్కారం కావాలని, తాత్కాలిక ఆర్డినెన్స్ కాదని పట్టుబట్టడంతో జల్లికట్టు రద్దయింది. దీంతో ఆయన దిండిగల్లులో జల్లికట్టును ప్రారంభిస్తారని సమాచారం. తిరుచిరాపల్లిలోని మనపురాయ్లో జల్లికట్టు ఆనందోత్సాహాల మధ్య ప్రారంభమైంది. వేలాది మంది ప్రజలు సంతోషంతో కేరింతలు కొట్టారు. దూసుకొస్తున్న ఎద్దును అదుపు చేసేందుకు యువకులు సాహసోపేతంగా ప్రయత్నించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







