లష్కరే తోయిబా ఉగ్రవాదులకు మరణశిక్ష
- January 22, 2017
పాకిస్తాన్‌కు చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులకు పశ్చిమబెంగాల్ స్థానిక కోర్టు మరణశిక్ష విధించింది. పాక్‌కు చెందిన మొహమద్ యూనస్, అబ్దుల్లాతో పాటు భారతీయుడైన ముజఫర్ అహ్మద్ రాథోడ్‌ను 2007లో బీఎస్ఎఫ్ జవాన్లు భారత్-బంగ్లా సరిహద్దుల్లో అరెస్ట్ చేశారు.
భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నారని వీరిపై నమోదైన కేసును విచారించిన పశ్చిమబెంగాల్లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బాన్గాన్లోని న్యాయస్థానం వీరికి మరణశిక్ష విధించింది. అబ్దుల్లా కరాచీ నివాసి కాగా, యూనస్ స్వస్థలం హరిపూర్ అని చెప్పారు. ఇక రాథోడ్ జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్ నుంచి వచ్చాడు.
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







