జాతిపితకు ఇంత అవమానమా..!

- January 23, 2017 , by Maagulf
జాతిపితకు ఇంత అవమానమా..!

ఆంధ్రజ్యోతి: ఆన్‌లైన్‌లో అమ్మకాలు పెంచుకునేందుకు కొన్ని సంస్ధలు ఎంతటి ఘోరానికైనా దిగజారుతున్నాయి. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ సంస్ధ జాతి పిత మహాత్ముని బొమ్మను చెప్పులపై ముద్రించి భరత జాతిని అవమానించింది. గతంలో ఇలాంటి తప్పిదాలకు పాల్పడిన అమెజాన్ మరోసారి భారతీయుల విశ్వాసాలతో ఆడుకుంది. విషయం తెలుసుకున్న భారత విదేశాంగశాఖా మంత్రి సుష్మా స్వరాజ్ గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో ఆ సంస్ధ దిగి వచ్చింది. ఆన్‌లైన్‌లో అమ్మకాలు పెంచుకునేందుకు ప్రజల విశ్వాసాలతో ఆటలాడటం అమెజాన్‌కు కొత్తేమీ కాదు. గతంలో చెప్పులు, అండర్ వేర్లు, డోర్ మ్యాట్లు, బీర్లపై భారతీయ దేవతల బొమ్మలను ముద్రించి విక్రయాలు కొననసాగింది.

దీంతో అప్పట్లో భారతీయుల నుంచి గట్టి వ్యతిరేకత వ్యక్తమవడంతో వెనక్కి తగ్గింది. తాజాగా జాతిపిత మహాత్మాగాంధీ బొమ్మను అమెజాన్ వెబ్‌సైట్ కించపరిచింది. మహాత్ముని బొమ్మను ఫ్లిప్-ఫ్లాప్ చెప్పులపై ముద్రించి అమ్మకాలు సాగించింది. అమెరికా, కెనడా వెబ్‌సైట్లలో ఈ చెప్పులు దర్శనమిచ్చాయి.

చెప్పులపై మహాత్ముని బొమ్మను వెబ్‌సైట్‌లో గమనించిన భారతీయులు ట్విట్టర్‌లో సుష్మా స్వరాజ్‌కు తెలియపరిచారు. దీంతో అమెజాన్‌పై సుష్మా ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయులకు బేషరుతుగా క్షమాపణ చెప్పాలని హెచ్చరించారు. భారతీయులను కించపరిచే విధంగా ఉన్న వస్తువులను వెబ్‌సైట్ల నుంచి తొలగించాలని లేదంటే ఇండియాలో వ్యాపారం చేసుకోనివ్వబోమని, సంస్ధ సిబ్బందికి వీసాలు మంజూరు చేసేది లేదని ఆమె స్పష్టం చేశారు.

సుష్మా దెబ్బకు అమెజాన్ దిగి వచ్చింది. జరిగిన తప్పుకు వివరణ ఇచ్చింది. భారతీయుల విశ్వాసాలపై తమకు గౌరవముందని, వెంటనే ఆయా వస్తువులను తొలగించామని వివరణ ఇచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com