ఆస్ట్రేలియా విమానాశ్రయంలో పాస్‌పోర్టులతో పనిలేని బయోమెట్రిక్ టెక్నాలజీ..

- January 23, 2017 , by Maagulf
ఆస్ట్రేలియా విమానాశ్రయంలో పాస్‌పోర్టులతో పనిలేని బయోమెట్రిక్ టెక్నాలజీ..

తొలిసారిగా ఆస్ట్రేలియా ప్రభుత్వం బయోమెట్రిక్ టెక్నాలజీ ద్వారా పాస్ పోర్టులు, ప్యాసెంజర్ కార్డులతో పని లేకుండా ప్రపంచంలోనే తొలిసారిగా విమానాశ్రయాలలో ఐరిష్ లేదా ఫేసియల్ రికగ్నిషన్ వంటి బయోమెట్రిక్ డేటను ఉపయోగించుకుని పనిచేసి ఈ ప్రాజెక్టు అమల్లోకి వస్తే ఇమిగ్రేషన్ ప్రక్రియలో మానవ ప్రమేయం పూర్తిగా తగ్గిపోవడంతో పాటు, పాస్పోర్టుతో పనిలేకుండానే తనిఖీలు పూర్తి చేసుకోవచ్చు.  ఇమిగ్రేషన్ డెస్క్ వద్ద క్యూలైన్లను త్వరగా తగ్గించేందుకు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో అంతర్జాతీయ పాస్‌పోర్టులు కలిగిన కొందరికే పరిమిత సంఖ్యలో ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. అయినప్పటికీ దేశంలోకి అడుగుపెట్టాలంటే ప్రయాణీకులు తమ పాస్‌పోర్టును స్కాన్ చేయించుకోవడం తప్పనిసరి అవుతోంది.  అయితే సీమ్‌లెస్ ట్రావెలర్ పేరుతో ప్రవేశపెట్టే నూతన విధానంలో దేశవాళీ ఎయిర్‌పోర్టుల్లో మాదిరిగానే అలా నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోవచ్చు.  తనిఖీల కారణంగా సమయం వృధాకాకుండా విమానాశ్రయాల్లో ఇలాంటి టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడం ఇదే తొలిసారి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com