'బి.యస్.ఎన్.యల్' బంపర్ ఆఫర్

- January 23, 2017 , by Maagulf
'బి.యస్.ఎన్.యల్' బంపర్ ఆఫర్

టెలికాం రంగంలో ఉచితంపై పెద్ద పోటీనే నడుస్తోంది. జియోతో మొదలైన ఈ పోరులో ఒక్కోసారి ఒక్కో టెలికాం రంగం విభిన్న ఆఫర్లతో ముందుకొస్తున్నాయి. తాజాగా ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్ మూడు నెలల పాటు ఉచిత కాల్స్ అంటూ సరికొత్త ఆఫర్‌తో వచ్చింది. అయితే ఈ ఆఫర్ ఈ నెల 24వ తేదీ నుంచి కొత్త బిఎస్ఎన్ఎల్ కనెక్షన్‌ను వాడేవారికి మాత్రమే వర్తిస్తుంది. రూ. 149తో రీచార్జ్ చేసుకుంటే దేశ వ్యాప్తంగా 30 రోజుల పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌ను చేసుకోవచ్చు. అదే రూ. 439తో రీచార్జ్ చేసుకుంటే మూడు నెలలపాటు ఉచిత వాయిల్స్ చేసుకోవచ్చు. అయితే ఇతర నెట్‌వర్క్‌లకు రోజుకు 30 నిమిషాలు మాత్రమే వాయిస్ కాల్స్ మాట్లాడుకునే అవకాశం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com