ఒమన్ లో వ్యాపారం కోసం వచ్చి అనుమానాస్పదంగా ఇద్దరు భారతీయులు మృతి..
- January 24, 2017
ఔత్సాహికులైన ఓ ఇరువురు భారతీయులు కేరళ నుంచి సందర్శన వీసాతో ఒమాన్ కు ఇటీవల వచ్చారు. అప్పటికే అక్కడ ఉన్న పలు క్రషింగ్ వ్యాపారాలు చేసేవారి మధ్యలో నూతనంగా తమ శైలిలో వ్యాపారం మొదలుపెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకొన్నారు. మరో నెలలో తుమ్మెరైట్ ప్రాంతంలో క్రషింగ్ వ్యాపారం ప్రారంభించాలని సమాయత్తమయ్యారు. ఈ లోపున ఆ ఇరువురు భారతీయులు శలాలః లో అనుమానాస్పదంగా మరణించడంతో పలువురు భారతీయ నిర్వాసితులు ఈ వ్యక్తుల చావు మిస్టరీ పై చర్చించుకొంటున్నారు. మస్కట్ లోని భారతదేశ రాయబార కార్యాలయం, భారత సంఘ క్లబ్ చైర్మన్, శలాలః మరియు గౌరవ కాన్సులర్ ఏజెంట్ (ధోఫర్ ప్రాంతం) మన్‌ప్రీత్ సింగ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ మరణించిన ఇరువురు దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్రం నుండి మొహమ్మద్ ముస్తఫా మరియు నజీబ్ మహమ్మద్ లుగా అధికారులు గుర్తించినట్లు ఆయన తెలిపారు. వారు ఒక సందర్శన వీసాతో ఒమాన్ వచ్చారని శలాలః నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుమ్మెరైట్ లో ఇప్పటికే పలు క్రషింగ్ కంపెనీ లు ఉన్న చోటునే మరో నూతన క్రషర్ కంపెనీ ను మొదలుపెట్టాలని ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకొన్నారని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో వీరిలో ఒకరు తన అపార్ట్మెంట్ లో చనిపోయినట్లు,మరొక వ్యక్తి ఆదివారం దహరిస్ వద్ద ఒక సమీప భవనంలో విగతజీవుడై ఉన్నాడని రాయల్ ఒమన్ పోలీస్ తెలిపారు. స్థానిక నివాసి ఒకరు ఉదయం 3 గంటల సమయంలో రోడ్డు మీద పడి ఉన్న శవాన్ని చూసి రాయల్ ఒమాన్ పోలీసులకు సమాచారం అందించాడు. నజీబ్ మహమ్మద్ తన వీసా గడువు ముగియనుండటంతో ఆదివారం తిరిగి భారతదేశం వెళ్లాలని భావించారు. కానీ ఆ లోపున ఆయన అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయాడు, ఈ మిస్టరీ మరణాలకు ఖచ్చితమైన కారణం ఇంకా తెలియాల్సి ఉందని ఆయన అన్నారు. ముస్తఫా మరియు నజీబ్ మరో భారతనిర్వాసితునితో కల్సి ఒమాన్ లో భాగస్వామ్య వ్యాపారం ప్రారంభించడానికి సిద్ధమైనట్లుతెలిపారు. క్రషింగ్ వ్యాపారం నిమిత్తం వారు గత రెండు నెలల నుంచి ఇక్కడ ఉన్నారు. ఇటీవల అన్ని ఫార్మాలిటీలు పూర్తి చేశాడు. వారు తదుపరి వారం తమ కొత్త వ్యాపార మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నారని సామాజిక కార్యకర్త పి ఎం జబీర్ చెప్పారు. భారతదేశం లోని కొచ్చిన్ లో వారి కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని, కానీ సమస్య వారు సందర్శించినప్పుడు వారికి ఇక్కడ తెల్సిన వారు ఎవరు లేకపోవడంతో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సామాజిక కార్యకర్తలు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







