మన చేనేతను ప్రమోట్ చేసిన కేటీఆర్ జపాన్‌లో...
- January 24, 2017
ఐటీ మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆలోమోబైల్ తయారీ రంగాల్లో పెట్టుబడులు ఆహ్వానించేందుకు మంత్రి జపాన్‌లో పర్యటిస్తున్నారు. పనిలోపనిగా చేనేతను ప్రమోట్ చేసేందుకు ఉన్న అవకాశాలను మంత్రి ఉపయోగించుకుంటున్నారు. జపాన్‌లో పర్యటిస్తున్న మంత్రి ఆ దేశ అతి పెద్ద వస్త్ర వ్యాపార సంస్థ అయిన ముజీ డైరక్టర్ షిమిజును కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ పోచంపల్లి చేనేతను పరిచయం చేశారు. సిల్క్ చీరను, శాలువాను ఆయనకు బహుకరించారు.
చేనేత కార్మికులను ఆదుకునేందుకు, వారు నేస్తున్న చేనేత వస్త్రాలకు విక్రయాలు కల్పించేందుకు ప్రభుత్వం చేనేత లక్ష్మీ పథకంను తీసుకు వచ్చింది. ఇటీవల అసెంబ్లీలో సైతం చేనేత ప్రదర్శన ఏర్పాటు చేశారు. ప్రజాప్రతినిధులంతా చేనేత వస్త్రాలు ధరించాలని ఇప్పటికే పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







