న్యూఢిల్లీ చేరుకున్న అబుధాబి యువరాజుకు ఘన స్వాగతం పలికిన మోదీ
- January 24, 2017
భారత గణతంత్ర దినోత్సవ ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు న్యూఢిల్లీ చేరుకున్న అబుధాబి యువరాజు మహ్మద్ బిన్ జయాద్ అల్ నహ్యాన్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘన స్వాగతం పలికారు. ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని స్వాగతం చెప్పారు. భారత్‌లో ఆయన మూడు రోజుల పాటు పర్యటిస్తారు. రాష్ట్రపతి భవన్‌లో ఆయనకు రేపు అధికార లాంఛనాలతో స్వాగతం చెబుతారు. ఆ తర్వాత యువరాజు బాపూఘాట్‌కు వెళ్లి మహాత్మాగాంధీకి నివాళులర్పిస్తారు. రేపు మధ్యాహ్నం హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమౌతారు. రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. రేపు సాయంత్రం ఉపరాష్ట్రపతి హమిద్ అన్సారీతో కూడా అబుధాబి యువరాజు సమావేశమౌతారు.
మహ్మద్ బిన్ జయాద్ అల్ నహ్యాన్‌కు ఆహ్వానం పలుకుతూ ప్రధాని మోదీ అరబిక్ భాషలో ట్వీట్ చేశారు. రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలు మరింత బలపడాలని మోదీ ఆకాంక్షించారు.

తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







