ఆంధ్రప్రదేశ్ లో 68వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ నరసింహన్‌..

- January 25, 2017 , by Maagulf
ఆంధ్రప్రదేశ్ లో 68వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ నరసింహన్‌..

ఆంధ్రప్రదేశ్ లో 68వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో గవర్నర్ నరసింహన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. రాష్ట్ర ప్రజలకు గవర్నర్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ సర్వతోముఖాభివృద్ధి చెందుతుందన్నారు. విద్య, వైద్య, సంక్షేమ రంగాల్లో మంచి ఫలిచాలు సాధిస్తున్నామని చెప్పారు.

విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, పలువురు మంత్రులు హాజరయ్యారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో నిర్వహించే గణతంత్ర వేడుకల్లో గవర్నర్‌ పాల్గొంటారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com