రైలు ప్రమాదాలపై విచారణ జరుపనున్న ఎన్‌ఐఏ

- January 26, 2017 , by Maagulf
రైలు ప్రమాదాలపై విచారణ జరుపనున్న ఎన్‌ఐఏ

ఇటీవల జరిగిన రైలు ప్రమాదాలపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) విచారణ జరపనుంది. కాన్పూర్‌లో ఇండోర్‌-పట్నా ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదం, ఆంధ్రప్రదేశ్‌లోని కూనూరులో హిరాఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పిన ఘటనలపై ఎన్‌ఐఏ విచారణ చేపట్టనుంది. ఎన్‌ఐఏ అధికారులు త్వరలోనే ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించనున్నారు. రైల్వే మంత్రి సురేశ్‌ ప్రభు రైలు ప్రమాదాలపై ఎన్‌ఐఏ అధికారులతో దర్యాప్తు చేయించాలని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు లేఖ రాసిన మరుసటి రోజే అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com