స్నేహితుడి హత్య: వ్యక్తికి జీవిత ఖైదు

- January 27, 2017 , by Maagulf
స్నేహితుడి హత్య: వ్యక్తికి జీవిత ఖైదు

మనామా: బహ్రెయినీ వ్యక్తికి స్నేహితుడిని హత్య చేసిన కేసులో జీవిత శిక్ష విధించింది న్యాయస్థానం. గత ఏడాది ముహర్రాక్‌లో ఈ హత్య జరిగింది. మార్చ్‌ 2016 జరిగిన ఈ హత్యకేసు వివరాల్లోకి వెళితే, ముగ్గురు యువకుల్ని ఈ ఘటనలో నిందితులుగా తేల్చారు. 20 ఏళ్ళ యువకుడు, తన స్నేహితుడు అబ్దుల్‌కాదెర్‌ అల్‌ కూహెజిని కత్తితో పొడిచి చంపేశాడు. వ్యక్తిగత కక్షలే ఈ హత్యకు కారణమని పోలీసులు విచారణలో తేల్చారు. హత్య అనంతరం, కత్తిని సముద్రంలో విసిరివేశాడు. ఈ ఘటనలో హంతకుడ్ని వారించేందుకు మరో వ్యక్తి ప్రయత్నించగా, అతని మీద కూడా దాడి జరిగింది. హంతకుడు హత్యా నేరాన్ని అంగీకరించడంతో, అతనికి హై క్రిమినల్‌ కోర్టు జీవిత ఖైదును ఖరారు చేసింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com