సౌదీ అరేబియా: తీవ్రవాద కేసుల్లో 5,094 మంది అరెస్ట్‌

- January 30, 2017 , by Maagulf
సౌదీ అరేబియా: తీవ్రవాద కేసుల్లో 5,094 మంది అరెస్ట్‌

తీవ్రవాదంతో సంబంధమున్న కేసుల్లో 5,094 మంది అరెస్ట్‌ కాగా, ఇందులో సౌదీల సంఖ్య 4,254. యెమెనీల సంఖ్య 281 మంది. తీవ్రవాద కేసులతో అరెస్టయిన విదేశీయుల్లో యెమనీలదే ఎక్కువ వాటా. ఇంకో వైపున సోమవారం, అధికారులు నలుగురు వ్యక్తుల్ని విడుదల చేశారు. వీరి జైలు శిక్ష పూర్తి కావడంతో, వీరిని విడుదల చేయడం జరిగింది. విడుదలైనవారిలో ఓ యెమనీ, ఓ సిరియన్‌, ఓ ఇండియన్‌, ఓ టర్క్‌ ఉన్నారు. సోమవారం 13 మందిని అరెస్ట్‌ చేశారు పోలీసులు. ఇందులో సౌదీ అరేబియా, బహ్రెయిన్‌, సుడాన్‌ మరియు పాకిస్తాన్‌కి చెందినవారున్నారు. వెస్టర్న్‌ సౌదీ అరేబియాలో అరెస్టయిన పాకిస్తానీల సంఖ్య 68 నుంచి 76కి చేరుకుంది. ఈ వివరాలన్నీ ఇంటీరియర్‌ మినిస్ట్రీకి చెందిన ప్రిజనర్స్‌ సెంటర్‌ నఫెతాలో పేర్కొనబడ్డాయి. 217 మంది సిరియన్లు, 30 మంది సుడానీస్‌, 18 మంది ఇండియన్లు, 11 మంది బహ్రెయినీలు, ముగ్గురు టర్క్‌లు సౌదీ అథారిటీస్‌ అరెస్ట్‌ చేసినవారిలో ఉన్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com