రెడ్ మటన్ కర్రీ...
- January 31, 2017కావలసిన పదార్థాలు: బోన్‌లెస్ మటన్ - 500 గ్రా. (నాలుగు సెం.మీ. పొడవు ముక్కలుగా కట్ చేసుకోవాలి), ఆలివ్ నూనె - 2 టేబుల్ స్పూన్లు, ఉల్లి పాయలు - తరిగినవి 150 గ్రా., వెల్లుల్లి పేస్టు - 1 టీ స్పూను, మైదాపిండి - 2 టేబుల్ స్పూన్లు, కారం - 1 టేబుల్ స్పూను, టమాటాలు - తరిగినవి 2 కప్పులు, క్యాప్సికమ్ - పెద్దది ఒకటి, రెండంగుళాల ముక్కలుగా తరిగి ఉంచుకోవాలి, పెరుగు మీది పుల్లటి మీగడ- అర కప్పు, ఉప్పు- 2 టీ స్పూన్లు, నల్లమిరియాల పొడి - అర టీ స్పూను
తయారుచేసే విధానం
పాత్రలో నూనె వేడి చేసి మటన్ ముక్కల్ని అన్ని వైపులా ఎరుపురంగు వచ్చేలా వేగించుకొని పక్కకు తీసి పెట్టాలి. అదే పాత్రలో తరిగిన ఉల్లిపాయముక్కల్ని వేసి, అవి కొంచెం బ్రౌను రంగులోకి వచ్చాక వెల్లులి పేస్టు వేయాలి. తర్వాత వేగించి పక్కనుంచిన మటన్ ముక్కల్ని కూడా అందులో వేసి బాగా కలపాలి. మైదాపిండిని, కారాన్ని కలిపి సన్నని సెగపైన నూనె తేలేవరకు ఉడికించండి. ఇప్పుడు తరిగిన టమాటాలు, ఉప్పు, మిరియాల పొడి కూడా వేసి మటన్ మెత్తబడే వరకూ ఉంచాలి. తరిగిన క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసి మరికొంత సేపు ఉడికించాలి. తయారైన ‘రెడ్ మటన్ కర్రీ’ పైన పుల్లటి పెరుగు మీది మీగడ అలంకరించి తినండి. (శాకాహారులు ఇదే వంటకాన్ని మటన్‌కు బదులుగా మీల్ మేకర్‌ను ఉపయోగించి చేసుకోవచ్చు.)
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ