అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- March 05, 2026
టెహ్రాన్: శ్రీలంక తీరానికి సమీపంలో ఇరాన్ యుద్ధనౌకను అమెరికా జలాంతర్గామి ముంచేయడం పశ్చిమాసియా మరియు దక్షిణాసియా జలాల్లో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ ఘటనపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి ఎక్స్ (X) వేదికగా స్పందిస్తూ అమెరికాను తీవ్రంగా హెచ్చరించారు. ఇరాన్ నావికాదళానికి చెందిన ప్రతిష్టాత్మక యుద్ధనౌక IRIS దేనా హిందూ మహాసముద్రంలో ప్రయాణిస్తుండగా, అమెరికాకు చెందిన ఒక శక్తివంతమైన జలాంతర్గామి దానిని ఢీకొట్టి ముంచేసింది. ఇరాన్ తీరానికి దాదాపు 2,000 మైళ్ల దూరంలో, అంతర్జాతీయ జలాల్లో ఈ దాడులు జరగడం గమనార్హం. భారత నావికాదళానికి అతిథిగా వెళ్తున్న సమయంలోనే ఈ అటాక్ జరిగిందని ఇరాన్ ఆరోపిస్తోంది.
ఈ యుద్ధనౌకలో దాదాపు 130 మంది నావికులు ఉన్నట్లు సమాచారం. ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా, అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధంగా అమెరికా ఈ “దారుణానికి” పాల్పడిందని అరాఘ్చి విమర్శించారు. “అమెరికా సృష్టించిన ఈ ప్రమాదకరమైన సంప్రదాయానికి ఆ దేశం భవిష్యత్తులో తీవ్రంగా పశ్చాత్తాపపడక తప్పదు” అని ఆయన హెచ్చరించారు. ఇప్పటివరకు పశ్చిమాసియాకే పరిమితమైన ఇరాన్-అమెరికా ఘర్షణలు, ఇప్పుడు హిందూ మహాసముద్రానికి పాకడం భారత్ వంటి దేశాలకు ఆందోళన కలిగించే విషయం. అంతర్జాతీయ నౌకాయాన మార్గాల్లో ఇలాంటి దాడులు జరగడం వల్ల ప్రపంచ వాణిజ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంది. అమెరికా ఈ ఘటన పై ఇప్పటి వరకు అధికారికంగా స్పందించనప్పటికీ, ఇరాన్ మాత్రం దీనిని యుద్ధ నేరంగా పరిగణిస్తోంది.
తాజా వార్తలు
- భారత్–షార్జా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు డ్రైవర్లకు కీలక సూచనలు..!!
- సౌదీ ప్రజలకు భారత కాన్సుల్ జనరల్ శుభాకాంక్షలు..!!
- బంధువుల మధ్య వివాహాలతో జన్యు వ్యాధుల ముప్పు.. డాక్టర్ల హెచ్చరికలు..!!
- ఓపెన్ ప్రిజన్స్ ప్రోగ్రామ్.. ఖైదీల కళల్లో శాంతి సందేశాలు..!!
- యూఎన్ఓలో ఖతార్ అమిర్ ప్రసంగానికి దౌత్యవేత్తల ప్రశంసలు..!!
- ముత్రా కేబుల్ కార్ భద్రతా ఏర్పాట్లపై సమీక్ష..!!
- ఇంట్లోకి చొరబడి కాల్పులు, 11 మంది మృతి
- ఆసియా-పసిఫిక్లో ఏరో ఇంజిన్ సేవల విస్తరణకు జీఎంఆర్ ఏరో టెక్నిక్–స్టాండర్డ్ ఏరో భాగస్వామ్యం
- యూపీఐ ఛార్జీలపై NPCI కీలక ప్రకటన







