యూ.ఏ.ఈ. లో ఈద్ సెలవులు - 33 శాతం డిస్కౌంటుతో విమాన ప్రయాణ ఆఫర్లు
- September 15, 2015
సౌదీ అరేబియాలో సెప్టెంబర్ 24, గురువారం, ఇద్ -అల్-అధా మొదటిరొజుగా ప్రకటింపబడింది. ఐతే, యూ ఏ. ఈ. లో ఈద్ సెలవుదినాలను అధికారికంగా ఇంకా ప్రకటించవలసి ఉన్నందున, ఆఖరి నిముషంలో విమాన ప్రయాణం పెట్టుకునే వారి కోసం స్థానిక విమానయాన సంస్థలు 33 శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.
షార్జా లోని ఏర్ అరేబియా సంస్థ యూ ఏ. ఈ. నుండి 43 గమ్యస్థానాలకు చేసే ప్రయాణంలో, సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 4 మధ్యలో ప్రయాణించడానికి ఈ రోజులోగా బుక్ చేసుకునే వారికి ఒకవైపు ఛార్జీలో 33 శాతం రాయితీ ప్రకటించగా; ఎతిహాద్ సంస్థ, బిజినెస్ మరియు ఎకానమీ క్లాసులలో కొన్ని చోట్లకు వెళ్లిరావదానికి డా సెప్టెంబరు 17 లోగా ప్లాన్ చేసుకుంటే , రానున్న వారంలో వచ్చే సెలవుదినాలతో సహా డిసెంబరు 10 వరకు స్పెషల్ ఫీజ్ ను అనుమతిస్తోంది. సెప్టెంబర్ 3 నుండి డిసెంబర్ 10 మధ్య వివిధ ప్రపంచ వ్యాప్త ప్రదేశాలకు ప్రయాణించే వారికి ఎమిరేట్స్ ఏర్ లైన్స్ సెప్టెంబరు 17 వరకు ప్రత్యేక టారిఫ్ ను అందిస్తోంది. కతార్ ఏర్ వేస్, సెప్టెంబర్ 17 లోగా బుక్ చేసుకునేవారికి దీర్ఘకాల ఆఫర్ అంటే సెప్టెంబర్ 25, 2015 నుండి మే 31, 2016 వరకు ఆఫర్ డీల్స్ ప్రకటించింది. ఇక ప్రభుత్వంసెలవులు ప్రకటించడమే తరువాయి- విమానాలు ప్రయాణీకులతో, పండగ వాతావరణంతో కళకళలాడవూ!
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







